Home
News

Samsung నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా సహా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి త్వరలో కొత్త ఫోన్‌ విడుదల కానుంది. శాంసంగ్‌ A సిరీస్‌కు చెందిన Samsung Galaxy A25 5G లాంచింగ్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ ఫోన్‌ గీక్‌బెంచ్‌లో నమోదు అయినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ సపోర్టు పేజీ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇందులో స్పెసిఫికేషన్లు, డిజైన్‌, ధర ఉన్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ A25 5G స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ ఇన్ఫినిటీ -U డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీప్రెష్‌ రేట్‌ సహా 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

Samsung Galaxy A25 5G smartphone

ఈ శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ Exynos 1280 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ Mail-G68 మరియు 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OneUI ఆధారంగా పనిచేస్తుంది. 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు సహా కొన్ని సంవత్సరాల పాటు OS అప్‌డేట్లను అందించనుంది.

బ్యాటరీ ప్యాక్‌ వివరాలు : గెలాక్సీ A25 5G స్మార్ట్‌ఫోన్ మైక్రో SD కార్డు ద్వారా ఫోన్‌ స్టోరేజీని 1TB వరకు పెంచుకొనే అవకాశం ఉంటుంది. మరియు A25 స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌తో కలిగి ఉంటుంది.

Samsung Galaxy A25 5G smartphone

శాంసంగ్‌ గెలాక్సీ A25 5G కెమెరా విభాగం విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS- ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ ఫీచర్‌తో వస్తుంది. మరియు 8MP అల్ట్రా వైడ్‌ సెన్సార్‌, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ ముందువైపు 13MP కెమెరాను కలిగి ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ A25 5G ధర : ఈ గెలాక్సీ A25 5G స్మార్ట్‌ఫోన్‌ బేస్‌ వేరియంట్ రూ.27 వేలు, టాప్‌ ఎండ్‌ వేరియంట్ రూ.35000కు కొనుగోలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లూ, బ్లాక్‌, యెల్లో, లైట్‌ బ్లూ, బ్లూ షేడ్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ A25 5G స్మార్ట్‌ఫోన్‌ త్వరలో భారత్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే కచ్చితమైన లాంచ్‌ తేదీ వెల్లడికాలేదు. దీనిపై శాంసంగ్‌ సంస్థ త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతోపాటు త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ మిగిలిన స్పెసిఫికేషన్లు, వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A25 5G smartphone will launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X