ఈ Samsung ఫోన్ పై రూ.3,500 ధర తగ్గింది ! కొత్త ధర ,సేల్ వివరాలు తెలుసుకోండి.

By Maheswara
|

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజ బ్రాండ్ శాంసంగ్ భారతదేశంలో మరో గెలాక్సీ A సిరీస్ ఫోన్ పై ధరను తగ్గించింది. ప్రస్తుతం, కంపెనీ Samsung Galaxy A32 ధరను ₹3,500 తగ్గించింది. ఈ హ్యాండ్‌సెట్ గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయినప్పుడు ₹23,499 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. ధర తగ్గింపు తర్వాత, Galaxy A32ని ఇప్పుడు ₹19,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగు ఎంపికలలో అందించబడుతుంది- Awesome Blue, Awesome Black మరియు Awesome Violet రంగులలో వస్తుంది.

 

Samsung Galaxy A32 స్మార్ట్ ఫోన్

Samsung Galaxy A32 స్మార్ట్ ఫోన్ 8GB RAM మరియు 128GB స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల FHD+ రిజల్యూషన్‌తో మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ డిస్‌ప్లే ఇన్ఫినిటీ-యు నాచ్‌తో కూడిన సూపర్ అమోలెడ్ ప్యానెల్ ను కలిగి ఉంది.

కెమెరా వివరాలు

కెమెరా వివరాలు

కెమెరా వివరాలు గమనిస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా ఉంది. వెనుక కెమెరా సిస్టమ్ 64MP ప్రధాన సెన్సార్‌తో F1.8 ఎపర్చరుతో 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో F2.2 ఎపర్చరుతో జత చేయబడింది, F2.4 ఎపర్చరుతో 5MP డెప్త్ కెమెరా మరియు F2.4 ఎపర్చరుతో 5MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీ ల కోసం, Galaxy A32 F2.2 ఎపర్చర్‌తో 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

5,000mAh బ్యాటరీ
 

5,000mAh బ్యాటరీ

ఇందులో, స్టోరేజీని 1TB వరకు విస్తరించడానికి ఈ ఫోన్ మైక్రో SD కార్డ్ స్లాట్‌తో వస్తుంది. Samsung Galaxy A32 స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందిస్తుంది మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా Samsung యొక్క One UIతో పనిచేస్తుంది.

Samsung Galaxy A53 5G ఫోన్ పై కూడా

Samsung Galaxy A53 5G ఫోన్ పై కూడా

ఈ ఫోన్ పైనే కాక గత నెలలో కూడా, Samsung Galaxy A53 5G ఫోన్ పై కూడా భారత దేశంలో ₹3,000 ధర తగ్గింపును పొందింది.ఈ ఫోన్ ప్రస్తుతం ₹31,999 ప్రారంభ ధరతో వస్తుంది.  Samsung Galaxy A33 5Gతో పాటు ఈ ఏడాది మార్చిలో Galaxy A53 5Gని విడుదల చేసింది. హ్యాండ్‌సెట్ 2 రోజుల వరకు బ్యాటరీ జీవితాన్ని అందించగలదని మరియు నీరు & ధూళి నిరోధకతను కలిగి ఉందని క్లెయిమ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు రంగు ఎంపికలలో అందించబడుతుంది - Awesome Blue, Awesome Black , Awesome Violet మరియు Awesome Peach కలర్ లలో వస్తుంది.

Samsung Galaxy A53 5G స్పెసిఫికేషన్స్ వివరాలు

Samsung Galaxy A53 5G స్పెసిఫికేషన్స్ వివరాలు

Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 12లో One UI 4.1తో రన్ అవుతుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి-HD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ-O డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 8GB వరకు ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ Exynos 1280 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 5-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో పాటు f/1.8 లెన్స్‌తో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉన్న క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, కంపెనీ f/2.2 లెన్స్‌తో ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను ప్యాక్ చేసింది. Samsung Galaxy A53 5G 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంది, దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy A32 Got Huge Price Cut Of Rs.3500 In India. Check New Price And Sale Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X