Samsung Galaxy A32 లాంచ్ అయింది!! రూ.2000 తగ్గింపు లాంచ్ ఆఫర్లతో అందుబాటులో..
శామ్‌సంగ్ కంపెనీ ఇప్పుడు గెలాక్సీ A-సిరీస్ మోడల్‌లో భాగంగా తాజా గెలాక్సీ A32 ను భారత్‌లో విడుదల చేసింది. ఈ కొత్త శామ్‌సంగ్ ఫోన్ 90HZ వాటర్ డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే మరియు డాల్బీ అట్మోస్ సపోర్ట్ క్వాడ్ రియర్ కెమెరాలలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 128GB స్టోరేజ్ మరియు 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉండి షియోమి Mi10i, రియల్‌మి X7, మోటోG 5G వంటి వాటికి గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ A32 ధరల వివరాలు
భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ A32 స్మార్ట్ ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో విడుదల అయింది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభించే ఈ ఫోన్ యొక్క ధర 21,999 రూపాయలు. ఈ ఫోన్ ఆసమ్ బ్లాక్, ఆసమ్ వైట్ , ఆసమ్ బ్లూ మరియు ఆసమ్ వైలెట్ వంటి కలర్ లో విడుదల అయింది. నేటి నుండి రిటైల్ షాపులు, శామ్‌సంగ్.కామ్ మరియు ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా అమ్మకం జరుగుతుంది. లాంచ్ ఆఫర్‌లలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, EMI లావాదేవీలపై 2,000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే దీనిని రూ.19,999 ధర వద్ద పొందవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ A32 స్పెసిఫికేషన్స్
శామ్‌సంగ్ గెలాక్సీ A32 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో వన్ యుఐ 3.1 తో రన్ అవుతుంది. ఇది 20: 9 కారక నిష్పత్తితో, 800 నిట్స్ గరిష్ట ప్రకాశంతో మరియు 90HZ రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G 80 Soc ను కలిగి ఉండి 6GB ర్యామ్‌తో జతచేయబడి ఉంది. ఫోన్ వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 123-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 5-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ A32 ఫీచర్స్
శామ్‌సంగ్ గెలాక్సీ A32 యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై 802.11ac, బ్లూటూత్ వి 5, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లో డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఇది 5,000WAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతును ఇస్తుంది. ఇది ఒక ఛార్జీపై 20 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








