స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తున్నారా.. A సిరీస్ ఫోన్ ధరను భారీగా తగ్గించిన శాంసంగ్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తన A సిరీస్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A34 ధరను ( Samsung Galaxy A34 ) తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2023 మార్చిలో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ రెండు వేరియంట్లలో విడుదల అవ్వగా.. ఈ రెండింటి ధరను రూ.2000 చొప్పున తగ్గిస్తూ శాంసంగ్ నిర్ణయం తీసుకుంది.
శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు : శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.30999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది. రూ.2000 చొప్పున ధర తగ్గింపు తర్వాత ఈ ఫోన్ల ధర వరుసగా రూ.28999 మరియు రూ.30999 గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్‌ఫోన్ రంగులు : ఈ స్మార్ట్ ఫోన్ లైట్ గ్రీన్, బ్లాక్, సిల్వర్ మరియు లైట్ వైలెట్ రంగుల్లో రంగుల్లో లభిస్తుంది. రెండు వేల రూపాయల తగ్గింపుతోపాటు శాంసంగ్ మరో ఆఫర్ ఇచ్చింది. అధికారిక ఇ- స్టోర్‌లో యాక్సిస్ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా అదనంగా రూ.1500 తక్షణ తగ్గింపును పొందవచ్చని పేర్కొంది.
శాంసంగ్ గెలాక్సీ A34 స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ మీడియా డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మరియు 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లే మరియు 1080*2400 పిక్సల్ రిజల్యూషన్‌తో వస్తుంది. మరియు 120Hz డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A34 బ్యాటరీ సామర్థ్యం : ఈ ఫోన్ వాటర్ రెసిస్టెంట్‌తో డిజైన్‌తో IP67 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. మరియు గొరెల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. డ్యూయల్ సిమ్, వైఫై, బ్లూటూత్, బిల్డ్ ఇన్ జీపీఎస్, USB-C ఛార్జింగ్ పోర్టుతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 198 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A34 కెమెరాలు : ఈ శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్‌ఫోన్ ( Samsung Galaxy A34 price drop ) ఆండ్రాయిడ్ 13 ఆధారిత OSను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ f/1.8 అపేచర్‌తో 48MP ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, f/2.4 అపేచర్‌తో 5MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు f/2.2 అపేచర్‌తో 13MP కెమెరాను అమర్చారు.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








