శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లు లీక్.. లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A35 5G Smartphone) త్వరలో భారత్ మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం మార్చిలో లాంచ్ అయిన గెలాక్సీ A34 5G హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం ఫోన్‌గా వస్తోంది. అయితే విడుదలకు ముందే A35 5G స్మార్ట్‌ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. కలర్ ఆప్షన్లు సహా ఇతర స్పెసిఫికేషన్ల సమాచారం బయటకు వచ్చింది.
నాలుగు రంగుల్లో : YtechB రిపోర్టు ఆధారంగా ఈ శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ నాలుగు రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. Awesome ఐస్ బ్లూ, Awesome లెమన్, Awesome లిలాక్, Awesome నేవీ రంగుల్లో అందుబాటులో ఉంటుందని సమాచారం. మరియు ఈ ఫోన్ కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్లను కలిగి ఉంటుంది.

దీంతోపాటు ఈ శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ 1080*2340 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మరియు ఈ ఫోన్ Exynos 1380 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A35 5G హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్, 8GB ర్యామ్ వేరియంట్లు మరియు 128GB, 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత UI పైన పనిచేయనుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ A35 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో f/1.8 అపేచర్‌తో 50MP కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP కెమెరా, f/2.4 అపేచర్‌తో 5MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు f/2.2 అపేచర్‌తో 13MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.
దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ A35 5G హ్యాండ్‌సెట్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం. గతంలో వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా 6GB ర్యామ్ వేరియంట్ ధర సుమారుగా రూ.35,000, 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.41,300 గా ఉండే అవకాశం ఉంది.
* మార్చి 4వ తేదీన భారత మార్కెట్‌లోకి శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 6.5 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. F15 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB మరియు 6GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతో సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాలను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ సహా 5Gకి సపోర్టు చేస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ జాజీ గ్రీన్ (Jazzy Green) మరియు గ్రూవీ వైలెట్ (Groovy Violet) రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








