శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ వివరాలు మరోసారి లీక్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ సహా..!
శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్ ఫోన్ ( Samsung Galaxy A35 5G Smartphone ) భారత్‌లో త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాల వార్తలు ఇటీవల అనేకసార్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్‌లో కనిపించింది. ఈ సందర్భంగా ఈ ఫోన్ OS, స్పెసిఫికేషన్లు, ప్రాసెసర్ వివరాలు వెల్లడయ్యాయి.
తాజాగా గూగుల్ ప్లే కన్సోల్‌లో.. : మైస్మార్ట్‌ప్రైస్ ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్‌లో SM-A356E మోడల్ నంబర్‌లో కనిపించింది. దీని ఆధారంగా ఈ శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OneUI OSను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు Exynos 1380 SoC చిప్ ARM Mail G68 GPU మరియు 8GB ర్యామ్‌తో జతచేయబడుతుంది.

ఈ గూగుల్ లిస్టింగ్ ఆధారంగా శాంసంగ్ కొత్త హ్యాండ్‌సెట్ ( Samsung New Smartphone 2024 ) 1080*2340 పిక్సల్ రిజల్యూషన్ సహా 450 dpi ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ స్లిమ్ బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుంది. మరియు సెంటర్ పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్‌లో ముందు కెమెరాను కలిగి ఉంటుంది.
ఇప్పటికే కీలక వివరాలు లీక్.. : ఇప్పటికే ఈ ఫోన్ గురించి అనేక వివరాలు లీక్ అయ్యాయి. దీని ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల 120Hz పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 25W వైరడ్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కెమెరా వివరాలు..! : ఈ ఫోన్ కెమెరా వివరాలు కూడా లీక్ అయ్యాయి. వీటి ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, దీంతోపాటు 8MP, 5MP కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ 13MP కలిగి ఉండే అవకాశం ఉంది.
అయితే ఈ శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ఏయే ర్యామ్, స్టోరేజీ వేరియంట్లులో విడుదల కానుందనే సమాచారం కూడా బయటకు రాలేదు. అయితే ఈ హ్యాండ్‌సెట్ Awesome ఐస్‌బ్లూ, Awesome లిలక్, Awesome నేవీ రంగుల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలపై శాంసంగ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications