బ్రహ్మాండమైన ధర తగ్గింపులతో శామ్సంగ్ గెలాక్సీ A50
శామ్సంగ్ అభిమానులకు మంచి శుభవార్త. ఇండియాలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మొబైల్ శామ్సంగ్. ఈ కంపెని నుంచి వచ్చిన ప్రతి మొబైల్ కూడా మంచి గుర్తింపును పొందాయి.
శామ్సంగ్ అభిమానులకు మంచి శుభవార్త. ఇండియాలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మొబైల్ శామ్సంగ్. ఈ కంపెని నుంచి వచ్చిన ప్రతి మొబైల్ కూడా మంచి గుర్తింపును పొందాయి.ఆఫర్లను ఇవ్వడంలో ఎప్పుడు ముందు ఉండే శామ్సంగ్ ఈ సంవత్సరం మొదటిలో శామ్సంగ్ గెలాక్సీA50ను రిలీజ్ చేసారు.

ఇప్పుడు ఫ్లిప్ కార్ట్,అమెజాన్,శామ్సంగ్ ఆన్లైన్ స్టోర్,మరియు TataCLiQ,రిలయన్స్ డిజిటల్ ద్వారా ఇండియాలో ముందు ఉన్న ధర కంటే Rs.1500 తగ్గింపుతో మరియు అద్భుతమైన ఆఫర్లతో విక్రయించనుంది.ఈ మొబైల్ పై ముందున్న ధర రూ.19,990 కంటే రూ.1,500 తగ్గింపు ధరతో ఇప్పుడు రూ.18,490కు అందుబాటులో ఉంది.ఈ ఫోన్ యొక్క ముఖ్యాంశాలు 4,000 mAh బ్యాటరీ, 4GB RAM,వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటాయి.

శామ్సంగ్ గెలాక్సీ A50 ధర వివరాలు:
ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీ A50 4GB RAM /64GB స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ.19,990 పై రూ.1,500 తగ్గింపు తో కేవలం రూ.18,490 కు మాత్రమే ప్రస్తుతం అందిస్తున్నారు.ఈ ధర తగ్గింపు 6GB RAM/64GBస్టోరేజీ వేరియంట్లకు కూడా వర్తించబడుతుంది. ఇప్పుడు దీని అసలు ధర రూ.22,990 కంటే రూ.21,490కు లబిస్తుంది.
* 4GB RAM/64GB స్టోరేజీ వేరియంట్ ------ రూ.19,990(రూ.18,490)
* 6GB RAM/64GB స్టోరేజీ వేరియంట్ ------ రూ.22,990(రూ.21,490)
ఇది అమెజాన్ ఇండియా,ఫ్లిప్ కార్ట్ మరియు శామ్సంగ్ ఆన్లైన్ షాప్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది బ్లాక్,వైట్ మరియు బ్లూ రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటుంది..

స్పెసిఫికేషన్స్:
శామ్సంగ్ గెలాక్సీ A50 6.4-inch ఫుల్-HD + (2340x1080 పిక్సెల్స్) ఇన్ఫినిటీ- V డిస్ప్లే తో పాటు 19.5: 9 కారక నిష్పత్తితో వస్తుంది.ఇది ఆండ్రాయిడ్9పై తో పనిచేస్తుంది.ఇది Exynos 9610 ఆక్టా-కోర్ ప్రాసెస్ ఆధారంగా పనిచేస్తుంది.మరియు డ్యూయల్ సిమ్ (నానో),Exynos 9610SoC శక్తితో పని చేస్తుంది. ఇది 4GB మరియు 6GB RAM ఎంపికలతో వస్తుంది.
ఇమేజెస్ మరియు వీడియోల కోసం వెనుక వైపు 25-మెగాపిక్సెల్ f / 1.9 ఎపర్చర్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు f / 2.2 ఎపర్చరుతో 5-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.ముందు వైపు f / 2.0 ఎపర్చరుతో 25-మెగాపిక్సెల్ సెన్సార్ తో సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
గెలాక్సీ A50 64GBఇంటర్నల్ స్టోరేజీ ఎంపికలను కలిగి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 512GB వరకు స్టోరేజిని విస్తరించవచ్చు. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.ఈ ఫోన్ ఫేస్ అన్లాక్ ఫీచర్ తో వస్తుంది. ఇదిలా ఉంటే స్మార్ట్ ఫోన్ 4,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది మరియు ఇది USB టైప్-సి ద్వారా వేగంగా 25Wఛార్జింగ్ కు మద్దతిస్తుంది.

స్పెసిఫికేషన్స్:
* డిస్ప్లే ------ 6.4-inch
* ప్రాసెసర్ ------ శామ్సంగ్ Exynos 9610
* ఫ్రంట్ కెమెరా ------ 25-మెగాపిక్సల్
* రెసొల్యూషన్స్ ------- 1080x2340 pixels
* RAM ------- 4GB/6GB
* OS ------- ఆండ్రాయిడ్9 పై
* స్టోరేజీ -------- 64GB
* బ్యాక్ కెమెరా -------- 25-మెగాపిక్సల్ + 8-మెగాపిక్సల్ + 5-మెగాపిక్సల్
* బ్యాటరీ -------- 4000mAh


Click it and Unblock the Notifications








