Samsung Galaxy A51,A71 స్మార్ట్‌ఫోన్‌ల మీద Rs.2000 భారీ తగ్గింపు!!!
శామ్‌సంగ్ సంస్థ తయారుచేసే అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఈ సంస్థ యొక్క స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిలో గెలాక్సీ A51 ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా గుర్తించబడింది. శామ్సంగ్ ఇప్పుడు ఇండియాలో గెలాక్సీ A71 తో పాటుగా గెలాక్సీ A51 ఫోన్ యొక్క ధరలను తగ్గించింది. ఈ ఫోన్‌ల మీద సంస్థ గరిష్టంగా రూ.2,000 వరకు ధరను తగ్గించింది. శామ్సంగ్ ఇటీవల గెలాక్సీ M51 ను విడుదల చేసిన తర్వాత దీని యొక్క ధరలను సవరించింది.

శామ్‌సంగ్ గెలాక్సీ A51, A71 తగ్గింపు ధరల వివరాలు
శామ్‌సంగ్ సంస్థ తన స్మార్ట్‌ఫోన్‌ల మీద రూ.2000 వరకు ధరలను తగ్గించిన తరువాత గెలాక్సీ A51 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ను ఇప్పుడు రూ.23,999 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. అలాగే కేవలం సింగిల్ వేరియంట్‌లో లభించే గెలాక్సీ A71 ను కూడా ఇప్పుడు రూ.30,000 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. సామ్‌సంగ్ గెలాక్సీ A51 యొక్క 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ మాత్రం రూ.25,999 పాత ధర వద్దనే లభిస్తుంది. కొత్త ధరలు అన్ని ఆన్‌లైన్ ఛానెల్‌లలో చూడవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల ధరల తగ్గింపుకు కారణాలు
శామ్‌సంగ్ సంస్థ తన గెలాక్సీ A సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరల తగ్గింపుకు గల కారణాలను వివరించలేదు. కానీ కంపెనీ తన "S" సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అప్ గ్రేడ్ స్మార్ట్‌ఫోన్‌లను తయారుచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అప్ గ్రేడ్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క నమూనాలు కొన్ని నెలల వ్యవధిలో ప్రారంభించబడతాయి. సంస్థ ఇటీవలే కొత్తగా గెలాక్సీ M51 ను 24,999 రూపాయల ధర వద్ద ప్రారంభించింది. శామ్‌సంగ్ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తో ఇండియా యొక్క మార్కెట్లో తనకంటూ కొత్త గుర్తింపు కోసం చూస్తున్నది.

గెలాక్సీ A51, గెలాక్సీ A71 కొత్త అప్‌గ్రేడ్‌లు
గెలాక్సీ A51 మరియు గెలాక్సీ A71 స్మార్ట్‌ఫోన్‌ల యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే సంస్థ యొక్క S, నోట్ మరియు జెడ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే కొద్దిగా తక్కువ ఫీచర్లను కలిగి ఉన్నాయి. కానీ ఆ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు గెలాక్సీ A సిరీస్‌కు మూడేళ్లకు కూడా ప్లాట్‌ఫామ్ అప్‌గ్రేడ్‌లను అందిస్తున్నట్లు శామ్‌సంగ్ కొంతకాలం క్రితం ప్రకటించింది. అందువల్ల గెలాక్సీ A51 మరియు A71 వాడుతున్న వారు మరో మూడు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లను పొందవచ్చని భావిస్తున్నారు. గెలాక్సీ A51 ఇటీవల గూగుల్ యొక్క సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ ను అందుకున్నది.

శామ్‌సంగ్ గెలాక్సీ A51 ఎక్సినోస్ 9611 SoC
శామ్‌సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను 1080x2400 పిక్సెల్స్ పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9611 SoC తో రన్ అవుతూ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ A51 క్వాడ్-కెమెరా ఫీచర్స్
గెలాక్సీ A51 యొక్క కెమెరాల విషయానికొస్తే ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








