శామ్‌సంగ్ గెలాక్సీ A52 ధరలు పెరిగాయి!! ఎంత పెరిగాయో తెలుసా??

|

శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ భారతదేశంలో మార్చి నెలలో శామ్‌సంగ్ గెలాక్సీ A52 ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ సంస్థ తన యొక్క ఈ ఫోన్ యొక్క ధర మీద రూ.1000 పెంచింది. 90Hz డిస్‌ప్లే, క్వాడ్ రియర్ కెమెరా మరియు IP67 సర్టిఫైడ్ బిల్డ్‌, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC, 8GB RAM వంటి ఫీచర్స్ కలిగి ఉన్న ఈ ఫోన్ లాంచ్ తరువాత మొదటిసారి ధరల పెరుగుదలను అందుకుంటున్నది. గెలాక్సీ A-సిరీస్ విభాగంలో గెలాక్సీ A72 తో పాటు ఈ ఫోన్ మార్చిలో లాంచ్ చేయబడింది. అయితే గెలాక్సీ A72 దేశంలో ధరల పెంపును అందుకోలేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

శామ్‌సంగ్ గెలాక్సీ A52 కొత్త ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A52 కొత్త ధరల వివరాలు

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ A52 మోడల్ యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.26,499 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.27,999 ధరల వద్ద లాంచ్ అయింది. అయితే ఇప్పుడు రూ.1000 ధరల పెరుగుదలను అందుకున్న తరువాత తాజా సవరణ ఫలితంగా ఇప్పుడు రూ. 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.27,499 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ ఇప్పుడు రూ.28,999 కొత్త ధరల వద్ద లభిస్తున్నాయి.

Jio vs Airtel vs Vi: డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఎవరు??Jio vs Airtel vs Vi: డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఎవరు??

శామ్‌సంగ్ గెలాక్సీ A52 స్పెసిఫికేషన్స్
 

శామ్‌సంగ్ గెలాక్సీ A52 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A52 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో వన్ UI3.1 తో రన్ అవుతుంది. ఇది 90HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC ను కలిగి ఉండి 8GB వరకు ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ తో12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌, 5-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్, మరియు మాక్రో లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

మైక్రోసాఫ్ట్ యొక్క తదుపరి సర్ఫేస్ హార్డ్‌వేర్ లాంచ్ ఈవెంట్ డేట్ వచ్చేసింది!!మైక్రోసాఫ్ట్ యొక్క తదుపరి సర్ఫేస్ హార్డ్‌వేర్ లాంచ్ ఈవెంట్ డేట్ వచ్చేసింది!!

25W వేగవంతమైన ఛార్జింగ్‌

శామ్‌సంగ్ గెలాక్సీ A52 ఫోన్‌లో 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ స్టాండర్డ్‌గా ఉంటుంది మరియు 25W వేగవంతమైన ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. గెలాక్సీ A52s లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత శామ్‌సంగ్ గెలాక్సీ A52 ధరల పెరుగుదల పెరిగింది. Realme మరియు Xiaomi తో సహా కంపెనీలు కూడా తమ సరసమైన ఫోన్‌ల ధరలను ఇటీవల పెంచాయి. గెలాక్సీ A52 ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 4GB వరకు RAM మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మోనో స్పీకర్‌తో వస్తుంది మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తుంది. ఈ పరికరం Android 11 లో OneUI 3.1 తో నడుస్తుంది. కనెక్టివిటీ పరంగా గెలాక్సీ A52 డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n / ac, బ్లూటూత్, GPS మరియు USB టైప్-సి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది.

PUBG: న్యూ స్టేట్ గేమ్ ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?PUBG: న్యూ స్టేట్ గేమ్ ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?

షియోమి, రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల ధరల పెరుగుదల

షియోమి, రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల ధరల పెరుగుదల

చైనా యొక్క స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు షియోమి మరియు రియల్‌మి కూడా ఇండియాలో తమ యొక్క స్మార్ట్‌ఫోన్‌ల ధరలను ఇటీవల పెంచారు. స్మార్ట్‌ఫోన్‌ల తయారీ మరియు రవాణా వ్యయం పెరిగినందున స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచుతున్నట్లు అన్ని కంపెనీలు ఇప్పటికే తెలిపారు. షియోమి కంపెనీ భారతదేశంలో ఇటీవల లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 10T, రెడ్‌మి నోట్ 10S, రెడ్‌మి 9 పవర్, రెడ్‌మి 9 మరియు రెడ్‌మి 9i వంటి ఐదు స్మార్ట్‌ఫోన్‌ల ధరలను మరొకసారి పెంచింది. రియల్‌మి కంపెనీ కూడా తన బ్రాండ్ యొక్క రియల్‌మి 8 5G, రియల్‌మి C21, రియల్‌మి నార్జో 30 4G మరియు రియల్‌మి C25 యొక్క స్మార్ట్‌ఫోన్‌ల ధరల మీద సుమారు 500 రూపాయల ధరలను పెంచింది. ఈ ధరల పెరుగుదల ఆఫ్‌లైన్ మరియు ఆన్ లైన్ లో ఇప్పటికే ప్రతిబంబిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A52 Smartphone Price Hicked in India: Here Is The New Price Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X