శామ్‌సంగ్ గెలాక్సీ A52s 5Gలాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లకు గల ఆదరణను దృష్టిలో ఉంచుకొని సంస్థ గెలాక్సీ A సిరీస్‌లో సరికొత్త మోడల్‌గా శామ్‌సంగ్ గెలాక్సీ A52s 5G ను నేడు భారతదేశంలో లాంచ్ చేసింది. గెలాక్సీ A52 5G కి అప్‌గ్రేడ్‌గా ఈ కొత్త శామ్‌సంగ్ ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా, హోల్-పంచ్ డిస్‌ప్లే డిజైన్‌తో 120Hz AMOLED డిస్‌ప్లే మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ కోసం స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. యువకులను ఆకట్టుకునే లక్ష్యంతో రియల్‌మి GT మాస్టర్ ఎడిషన్, వన్‌ప్లస్ నార్డ్ 2, పోకో F3 GT మరియు Mi 11X వంటి స్మార్ట్‌ఫోన్లకు పోటీగా విడుదలైన దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ A52s 5G ధరలు & సేల్స్ వివరాలు
భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ A52s 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.35,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.37,499. లభ్యత పరంగా ఈ శామ్‌సంగ్ గెలాక్సీ A52s 5G ఫోన్ నేడు అంటే బుధవారం నుండి అమెజాన్, Samsung.com మరియు ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి బ్లాక్, వైలెట్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. HDFC బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులు రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్ ను పొందేందుకు అర్హులు అవుతారు. దీనితో పాటుగా రూ.3,000 అప్‌గ్రేడ్ బోనస్ కూడా ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ A52s 5G స్పెసిఫికేషన్స్
శామ్‌సంగ్ గెలాక్సీ A52s 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై వన్ UI 3 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫీచర్ చేయబడి ఉంది. అలాగే ఇది హుడ్ కింద ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB వరకు RAMతో జతచేయబడి ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G తో వచ్చిన గెలాక్సీ A52 5G కంటే చిప్‌సెట్ ఒక పెద్ద మార్పు.

శామ్‌సంగ్ గెలాక్సీ A52s 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.2 అల్ట్రా-వైడ్ లెన్స్ తో 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో F/2.2 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ A52s 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్టోరేజ్ విషయానికి వస్తే స్టాండర్డ్‌గా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. అంతర్నిర్మిత మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరణకు మద్దతు ఇస్తుంది. అలాగే కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, NFC మరియు USB Type-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. అలాగే ఇది 25W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ IP67 సర్టిఫైడ్ బిల్డ్ కలిగి ఉంది, ఇది దుమ్ము మరియు నీటి నిరోధకతను అందిస్తుంది.


Click it and Unblock the Notifications