32MP సెల్ఫీ కెమెరా, 8GB ర్యామ్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. ఆఫర్ ఎప్పటి వరకు ఉందంటే?
శాంసంగ్ సంస్థ తన A సిరీస్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A54 5G ధరను తగ్గించింది. ఈ హ్యాండ్‌సెట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్ల ధరను రూ.2000 చొప్పున తగ్గించింది. ప్రస్తుతం కొత్త ధరలు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో శాంసంగ్ వెల్లడించలేదు.
శాంసంగ్ గెలాక్సీ A54 5G ధర తగ్గింపు : శాంసంగ్ గెలాక్సీ A54 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. రూ.2000 ధర తగ్గింపు తర్వాత... 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.36,999 గా ఉంది. మరియు 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.38999 గా ఉంది.

యాక్సెస్ బ్యాంక్ కార్డుతో మరో రూ.2 వేలు తగ్గింపు : రూ.2000 ధర తగ్గింపుతోపాటు శాంసంగ్ సంస్థ మరో తగ్గింపు ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు ప్రయోజనాన్ని అందించింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ అవెషమ్ వైట్, అవెషమ్ లైమ్, అవెషమ్ వైలెట్ మరియు అవెషమ్ గ్రాఫైట్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
గెలాక్సీ A54 5G స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే : ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల పుల్ HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్ మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Exynos 1380 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత శాంసంగ్ one UI 5.1 OS పైన పనిచేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A54 5G బ్యాటరీ వివరాలు : ఈ శాంసంగ్ గెలాక్సీ A54 స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ సిమ్‌కార్డును సపోర్టు చేస్తుంది. మరియు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. మరియు స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.

ట్రిపుల్ కెమెరా సహా 32MP సెల్ఫీ కెమెరా : కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో 12MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, f/2.4 అపేచర్‌తో 5MP డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. మరియు LED ఫ్లాష్ సహా ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








