Home
News

Samsung కొత్త ఫోన్ డిజైన్‌, స్పెసిఫికేషన్లు లీక్‌.. విడుదల ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి గెలాక్సీ S24 సిరీస్‌ను త్వరలో విడుదల చేయనుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకు కొన్ని వారాల ముందు మరో కొత్త ఫోన్‌ శాంసంగ్‌ గెలాక్సీ A55 5G ఫోన్‌ ( samsung Galaxy A55 smartphone) వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా లీకైయ్యాయి. గ్లోబల్‌ మార్కెట్‌లోకి ఈ ఫోన్ త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

కొన్ని నివేదికల ప్రకారం.. శాంసంగ్‌ గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ ముందువైపు సెంటర్‌ పంచ్‌ హోల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 6.5 అంగుళాల ప్లాట్‌ FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. మరియు గొరెల్లా గ్లాస్‌ 5 భద్రతను కలిగి ఉంటుంది.

samsung Galaxy A55 smartphone

ఈ శాంసంగ్‌ హ్యాండ్‌సెట్‌ ప్లాట్‌ సైడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. పవర్‌ మరియు వాల్యూమ్‌ బటన్లు ఫోన్‌కు కుడివైపున ఉంటాయి. ఛార్జింగ్‌ పోర్టు మరియు స్వీకర్‌ యూనిట్‌ కిందవైపున ఉంటాయి. మరియు మెటాలిక్‌ ఫ్రేమ్‌తో వస్తుంది. మరియు ఈ ఫోన్ 8.2 mm థిక్‌నెస్‌తో వస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ A55 స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ Exynos 1480 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు 8GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీ వరకు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 25W వైరడ్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP ఆల్ట్రావైడ్ కెమెరా, 5MP మ్యాక్రో సెన్సార్‌తో వస్తుంది. అదే ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాలను అమర్చినట్లు సమాచారం.

శాంసంగ్ గెలాక్సీ A55 విడుదల తేదీ..!! : శాంసంగ్ గెలాక్సీ A54 స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 2023లో విడుదల చేశారు. ఫోన్‌ కూడా 2024 మార్చిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఎంత ధరకు విడుదల కానుందనే సమాచారం వెల్లడికాలేదు. అయితే కొ‌న్ని నివేదికల ప్రకారం ఈ హ్యాండ్ సెట్ రూ.40000 నుంచి రూ.45000 మధ్య విడుదల అయ్యే అవకాశం ఉంది.

* శాంసంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 200MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా పనితీరుకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల శాంసంగ్‌ అక్టోబర్ 30న విడుదల చేసింది. ఈ కొత్త కెమెరా సెన్సార్‌ 4k జూమ్‌ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఇమేజ్‌ను మరింత మెరుగుపరుస్తుందని తెలిపింది.

శాంసంగ్‌ తాజాగా విడుదల చేసిన వీడియోలో ISOCELL జూమ్‌ ఎనీప్లేస్‌ టెక్నాలజీ పనితీరును వివరించింది. ఇటీవల ఆవిష్కరించిన స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌లోని క్వాల్‌కాం AI ఇంజిన్‌తోపాటు 200MP కెమెరా సెన్సార్‌.. ఆటోమేటిక్‌ సబ్జెక్ట్‌ ట్రాకింగ్‌కు మద్దతు అందిస్తుందని తెలిపింది. దీంతోపాటు 4kలో రికార్డు చేసిన వీడియోను నాలుగురెట్లు జూమ్‌ చేసేందుకు టెట్రా పిక్సల్‌ టెక్నాలజీ సపోర్టు చేస్తుందని పేర్కొంది.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 200MP కెమెరా సెన్సార్‌ డ్యూయల్‌ రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుందని తెలిపింది. ఐసోసెల్‌ జూమ్ ఎనీప్లేస్‌ టెక్నాలజీ.. ఒకేసారి రెండు 4K నాణ్యత కలిగిన వీడియోలను రికార్డు చేయవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. వీడియో రికార్డు చేసిన తర్వాత కూడా ఫ్రేమ్‌ను మార్చుకొనే అవకాశం ఉంటుందని వెల్లడించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung Galaxy A55 5g smartphone specifications leaked ahead of launch in 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X