Home
News

50MP కెమెరా, 8GB ర్యామ్‌తో శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్‌, సేల్‌ వివరాలు..!

శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ త్వరలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ కానుంది. వచ్చే నెలలోనే శాంసంగ్‌ గెలాక్సీ A55 స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy A55 5G Smartphone) విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే ఈ హ్యాండ్‌సెట్‌ స్పిసిఫికేషన్లు కొన్ని లీక్‌ అయ్యాయి. ఈ కొత్త గెలాక్సీ హ్యాండ్‌సెట్‌.. గత సంవత్సరం విడుదల అయిన శాంసంగ్‌ గెలాక్సీ A54 కు తర్వాత తరం వెర్షన్‌గా వస్తుంది.

కొన్ని నివేదికల ఆధారంగా ఈ శాంసంగ్‌ గెలాక్సీ A55 స్మార్ట్‌ఫోన్‌ Exynos 1480 చిప్‌సెట్‌తో 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుందని సమాచారం.

Samsung Galaxy A55 Smartphone specs leaked

శాంసంగ్‌ గెలాక్సీ A55 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ గా రానుంది. మరియు 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుందని తెలుస్తోంది. మరియు Exynos 1480 ప్రాసెసర్‌పైన పనిచేస్తుంది.

ఈ శాంసంగ్‌ కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ (Samsung New Smartphone) 6.6 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2340 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. మరియు IP67 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 231 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy A55 Smartphone specs leaked

తాజాగా వచ్చిన ఓ నివేదిక ప్రకారం ఈ శాంసంగ్‌ గెలాక్సీ A55 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సహా f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 12MP కెమెరా, f/2.2 అపేచర్‌తో 5MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు f/2.2 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్‌ 5.3, GPS మరియు NFC, USB- C 2.0 ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన‌్ మార్చినెలలో విడుదల కానుందని తెలుస్తున్నా.. సరైన తేదీని సంస్థ ఇప్పటికి ప్రకటన చేయలేదు. దాంతోపాటు ఈ స్పెసిఫికేషన్లలో కొన్నింటిపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ A55 స్మార్ట్‌ఫోన్‌ జర్మనీలో మార్చి 11 నుంచి కొనుగోలు అందుబాటులో ఉంటుంది. భారత కరెన్సీ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.40,300 ఉండే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్‌ ఐస్‌ బ్లూ, నేవీ, పర్పల్‌, వైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అయితే భారత్‌లో విడుదలపై శాంసంగ్‌ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A55 Smartphone key features and specifications leaked ahead launch in march
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X