Samsung నుంచి మరో కొత్త ఫోన్ Galaxy A72 ! స్పెసిఫికేషన్లు చూడండి.
శామ్‌సంగ్ తన కొత్త గెలాక్సీ A72 స్మార్ట్‌ఫోన్ మోడల్ ను త్వరలో విడుదల చేయాలని యోచిస్తోంది. ముఖ్యంగా ఈ గొప్ప సాఫ్ట్‌వేర్ ఫీచర్ అద్భుతమైన కెమెరాల వంటి వివిధ సపోర్ట్‌లతో వస్తుంది. అలాగే గెలాక్సీ A72 మోడల్ నెంబర్ SM-A725F గా ఉంది.

ఇలాంటి సమయం లో వార్త పత్రికల నివేదికల ప్రకారం ఈ ఫోన్ కు సంబందించిన కొన్ని స్పెసిఫికేషన్లు లీక్ అయినట్లు సమాచారం. ఈ గెలాక్సీ A72 ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 720G చిప్‌సెట్ ఆధారంగా ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా, ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ విడుదల అవుతుందని సమాచారం.

స్పెసిఫికేషన్లు
గెలాక్సీ A72 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల FHD+ డిస్ప్లే డిజైన్ ఉంది. ఈ పరికరం 1080 పిక్సెల్ రిజల్యూషన్ మరియు మెరుగైన భద్రతా ఫీచర్లతో రానుంది.శాంసంగ్ సంస్థ ప్రకారం, ఈ ఫోన్ డిజైన్ పై ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారని అర్థమౌతోంది.గెలాక్సీ A72 స్మార్ట్‌ఫోన్ 4 GB / 6 GB ర్యామ్, 64 GB / 128 GB ఇంటర్నల్ మెమరీ ఆధారంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు అదనంగా మెమరీ విస్తరణ మద్దతు ఉంది. అంటే మెమరీ కార్డును ఉపయోగించడానికి మీకు ప్రత్యేకంగా మెమరీ స్లాట్ ఇవ్వబడుతుంది.

వెలువడిన సమాచారం ప్రకారం
ఆన్లైన్ లో వెలువడిన సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో మొత్తం నాలుగు కెమెరాలను కలిగి ఉంది, వీటిలో 64 MP ప్రైమరీ సెన్సార్ ఉంది. ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ మోడల్‌లో 32 MP సెల్ఫీ కెమెరా, LED ఫ్లాష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ వంటి వివిధ సపోర్ట్‌లు కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ గురించిన మరింత సమాచారం
గెలాక్సీ A72 స్మార్ట్‌ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ అమర్చారు, కాబట్టి ఛార్జింగ్ గురించి ఆందోళన ఉండదు. ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లో 20 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. వీటిలో వేలిముద్ర సెన్సార్‌తో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి.ఈ శాంసంగ్ గాలక్సీ A 72 ఫోన్ డ్యూయల్ 4 జి వోల్ట్ఇ, వైఫై 802.11 ఎసి, జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ మరియు 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో సహా పలు రకాల కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది.ఈ ఫోన్ గురించిన మరింత పూర్తి సమాచారం తెలియవలసిఉంది.ధర మరియు లాంచ్ తేదీలు త్వరలో విడుదల కాగలవు.


Click it and Unblock the Notifications






