Samsung Galaxy A73 5G సేల్స్ మొదలుకానున్నాయి!! లాంచ్ ఆఫర్లలో డిస్కౌంట్స్ అనేకం

|

శామ్సంగ్ బ్రాండ్ ఇండియాలో గత వారం గెలాక్సీ A సిరీస్‌ విభాగంలో గెలాక్సీ A73 5G మరియు గెలాక్సీ A33 5G స్మార్ట్‌ఫోన్లను గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఇందులో గెలాక్సీ A73 5G ఫోన్ యొక్క మొదటి సేల్స్ ఈ రోజు సాయంత్రం 6PM నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిని కొనుగోలు చేయాలనీ చూస్తున్న వినియోగదారులకు గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ గెలాక్సీ A73 5G ఫోన్ 108-మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్‌, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ AMOLED+ డిస్‌ప్లే ఫీచర్లను కలిగి ఉండి Snapdragon 778G SoC ద్వారా రన్ అవుతూ 8GB RAMతో జత చేయబడి వస్తుంది. అలాగే ఇది IP67-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉండి దుమ్ము మరియు నీటి నిరోధకతను కలిగి ఉన్నాయి. ఇటీవల భారత మార్కెట్లో కొనుగోలు చేయడానికి లభించే గెలాక్సీ కొత్త ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

గెలాక్సీ A73 5G స్మార్ట్‌ఫోన్‌ ధరలు & సేల్స్ డిస్కౌంట్ ఆఫర్స్

గెలాక్సీ A73 5G స్మార్ట్‌ఫోన్‌ ధరలు & సేల్స్ డిస్కౌంట్ ఆఫర్స్

శామ్సంగ్ గెలాక్సీ A73 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క నేటి మొదటి సేల్స్ లో వినియోగదారులు రెండు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ మోడల్ ను రూ.41,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.44,999 ధర వద్ద గ్రే, మింట్ మరియు వైట్ కలర్ ఆప్షన్‌లలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ప్రత్యేక అమ్మకపు ఆఫర్‌లను వీక్షించడానికి ఈరోజు సాయంత్రం 6 గంటలకు Samsung Live ఈవెంట్‌కు ట్యూన్ చేయవచ్చు. గత వారం గెలాక్సీ A73 5G స్మార్ట్‌ఫోన్‌ ని ప్రీ-బుక్ చేసిన కస్టమర్‌లు Samsung Finance+, ICICI బ్యాంక్ కార్డ్‌లు మరియు SBI క్రెడిట్ కార్డ్‌ల కొనుగోళ్ల మీద రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని సంస్థ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-బుక్ చేసిన కస్టమర్‌లు ఒక జత Samsung Galaxy Buds Live నిజమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను రూ.499 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. వీటి రిటైల్ ధర రూ.6,990.

Samsung Galaxy A73 5G స్పెసిఫికేషన్స్
 

Samsung Galaxy A73 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A73 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్ HD + సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ-O డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ SoC ప్రాసెసర్‌తో ఆధారితమైనది మరియు UI 4.1తో Android 12లో రన్ అవుతుంది. ఇది 8GB RAM మరియు 256GB ఇంటర్-స్టోరేజ్ కెపాసిటీతో కూడా వస్తుంది. అదనంగా, మైక్రో SD కార్డ్ ద్వారా నిల్వ సామర్థ్యాన్ని 1TB వరకు పొడిగించవచ్చు.

ఆప్టిక్స్

శామ్సంగ్ గెలాక్సీ A73 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 100 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. రెండవ కెమెరా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, మూడవ కెమెరా 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు నాల్గవ కెమెరా 5-మెగాపిక్సెల్ మాక్రో షూటర్. ఇందులో 32 మెగాపిక్సెల్ సెన్సార్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరా కూడా ఉంది. అంతేకాకుండా ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.1, GPS / A-GPS మరియు USB టైప్ C పోర్ట్ ఉన్నాయి. ఇందులో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గైరో మీటర్, మాగ్నెటోమీటర్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A73 5G Smartphone First Sale Starts Today on Company Website: Price, Discount offers and Deals

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X