అమెజాన్‌‌లో Galaxy A8+ (2018), జనవరి 10న మార్కెట్లోకి!

Posted By: BOMMU SIVANJANEYULU

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్‌‍సంగ్ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. Galaxy A8+ (2018) పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

అమెజాన్‌‌లో  Galaxy A8+ (2018), జనవరి 10న మార్కెట్లోకి!

జనవరి 10న న్యూఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సామ్‌సంగ్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. ఈ ఫోన్‌ను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. సేల్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే రివీల్ కానున్నాయి.

Galaxy A8+ (2018) సంబంధించిన డెడికేటెడ్ పేజీని అమెజాన్ ఇండియా ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో లాంచ్ చేసింది. ఈ పేజీలో పలు టీజర్ వీడియోలతో పాటు “Notify me” ఆప్షన్‌ను కూడా అమెజాన్ అందుబాటలో ఉంచింది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ మెయిల్ ఐడీని సబ్మిట్ చేసినట్లయితే ఫోన్ లాంచింగ్‌కు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అమెజాన్ నుంచి మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందతాయి.

Galaxy A8+ (2018) స్పెసిఫికేషన్స్..

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (18.5:9 యాస్పెక్ట్ రేషియో), సూపర్ అమోల్డ్ ప్యానల్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ ఆక్టా కోర్ 7885 సాక్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి,6జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ , కనెక్టువిటీ ఫీచర్లు 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై 802.11ఏసీ, బ్లుటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

ఈ ఎనిమిది ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, రూ. 8 వేలకు పైగానే..

English summary
Samsung Galaxy A8+ (2018) India launch is expected on January 10, and the South Korean major has already started sending media invites for an event in New Delhi.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot