జనవరి 10 నుంచి Galaxy A8 ఫోన్‌ల అమ్మకాలు!

Posted By: BOMMU SIVANJANEYULU

కొద్ది వారాల క్రితం సామ్‌సంగ్ అనౌన్స్ చేసిన Galaxy A8 (2018), Galaxy A8+ (2018) స్మార్ట్‌ఫోన్‌లు మరికొద్ది రోజుల్లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోన్నాయి. ఇండియన్ మార్కెట్లో జనవరి 10వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యం కావొచ్చని విశ్వసనీయవర్గాల సమచారం. ఈ ఫోన్‌లకు సంబంధించిన టీజర్ పేజీని అమెజాన్ ఇండియా ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మిడ్-రేంజ్ స్పెసిఫికేషన్లతో హై-ఎండ్ లుక్..

మిడ్-రేంజ్ మార్కెట్‌కు అనుగుణంగా ఈ ఫోన్‌ల ధరలు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రీమియమ్ రేంజ్ స్పెసిఫికేషన్‌లతో లోడ్ అయి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు గ్లాస్ బ్యాక్ ఇంకా మెటల్ ఫ్రేమ్‌తో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతున్నాయి. ఐపీ68 సర్టిఫికేషన్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లకు డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సపోర్ట్ మరో ప్రధానమైన హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

Galaxy A8 (2018) మోడల్ స్పెసిఫికేషన్స్..

5.6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (18.5:9 యాస్పెక్ట్ రేషియో), సూపర్ అమోల్డ్ ప్యానల్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ ఆక్టా కోర్ 7885 సాక్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై 802.11ఏసీ, బ్లుటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

ఆండ్రాయిడ్ గోతో మైక్రోమ్యాక్స్ మొబైల్‌‌, కేవలం రూ. 2 వేలకే..

Galaxy A8+ (2018) స్పెసిఫికేషన్స్..

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (18.5:9 యాస్పెక్ట్ రేషియో), సూపర్ అమోల్డ్ ప్యానల్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ ఆక్టా కోర్ 7885 సాక్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి,6జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై 802.11ఏసీ, బ్లుటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

రూ.30,000లోపు ఉండొచ్చు..?

వియాత్నామ్ మార్కట్లో Galaxy A8, Galaxy A8+ అమ్మకాలు జనవరి 6 నుంచి ప్రాిరంభం కాబోతున్నాయి. అక్కడి మార్కెట్లో గెలాక్సీ ఏ8 ధరను రూ.30,980గాను, గెలాక్సీ ఎస్8 ప్లస్ ధరను రూ.38.040గాను సామ్ సంగ్ ఫిక్స్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ల ధరలు రూ.30,000లోపు ఉండొచ్చని తలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy A8 (2018) and Galaxy A8+ (2018) might be launched in India on January 10, claims a new report. The report does not shed any light on the pricing of these smartphones but we can expect them to be priced in the mid-range market.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot