Samsung నుంచి కొత్త ఫోన్ Galaxy A82 5G ! లీక్ అయిన వివరాలు ఇవే !

By Maheswara
|

శామ్‌సంగ్ తన గెలాక్సీ A82 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయాలని యోచిస్తోంది. మరియు దీనిని ధృవీకరించడానికి, కొత్త స్మార్ట్ఫోన్ యొక్క ప్రచార టీజర్ వీడియోను వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.

అంచనా ఫీచర్లు

అంచనా ఫీచర్లు

గెలాక్సీ క్వాంటం 2 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గత నెలలో కొరియా మార్కెట్లో విడుదల చేసింది. ఇండియా లో కూడా త్వరలో విడుదల కానున్నట్లు అంచనా వేస్తున్నారు.విడుదల అయిన ప్రచార వీడియో నుంచి మనము గమనించిన కొన్ని ఫోన్ ఫీచర్లను మరియు డిజైన్ లక్షణాలను ఇక్కడ తెలుసుకుందాము. ఇక్కడ తెలుపబడుతున్న ఈ గెలాక్సీ A82 5G స్మార్ట్‌ఫోన్ మోడల్ యొక్క ఫీచర్లు అంచనా మాత్రమే.శామ్‌సంగ్ గెలాక్సీ A82 5G స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల క్యూహెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తుందని తెలిసింది. 1080 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరియు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్ ఆధారంగా కూడా ఇది పనిచేస్తుందని అంచనా వేయబడింది.

Also Read:ఈ నెల May 2021 లో లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..! లిస్ట్ చూడండి.Also Read:ఈ నెల May 2021 లో లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..! లిస్ట్ చూడండి.

స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో మొత్తం మూడు కెమెరాలు
 

స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో మొత్తం మూడు కెమెరాలు

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6 జీబీ / 8 జీబీ/12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ బ్రహ్మాండమైన స్మార్ట్‌ఫోన్ అదనంగా మెమరీ విస్తరణకు మద్దతు ఇస్తుంది. అనగా, మీరు ప్రత్యేకంగా మెమరీ కార్డ్ కూడా ఉపయోగించుకోవచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ A82 5G స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. 64 ఎంపి ప్రైమరీ కెమెరా + 12 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 5 ఎంపి మాక్రో సెన్సార్. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్‌లో 10 ఎంపి సెల్ఫీ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ వంటి పలు అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

శామ్‌సంగ్ గెలాక్సీ A82 5G స్మార్ట్‌ఫోన్‌లో 4500 mAh బ్యాటరీ ఉంది. కాబట్టి ఛార్జింగ్ గురించి చింతించకండి. ఈ స్మార్ట్ఫోన్ 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి వివిధ ఫీచర్లతో వస్తుంది.శామ్‌సంగ్ గెలాక్సీ A82 5G స్మార్ట్‌ఫోన్ మోడల్‌లో స్టీరియో స్పీకర్లు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5 జి కనెక్టివిటీ, యుఎస్‌బి టైప్-సి, 4 జి ఎల్‌టిఇ, వైఫై, బ్లూటూత్ వి 5.1, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి వివిధ కనెక్టివిటీ సపోర్ట్‌లు కూడా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A82 5G Smartphone Teaser Launched. Here Are Some Expected Feature.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X