Home
News

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్పత్తులపై కీలక ప్రకటన చేసిన శాంసంగ్..!

Samsung Galaxy Event 2025 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ తొలివారంలో గెలాక్సీ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్ సిరీస్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. శాంసంగ్ తన న్యూస్‌రూం పోస్ట్‌ ద్వారా వివరాలను వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఈవెంట్ పూర్తి వివరాలు.

ఈ ఈవెంట్‌ ఎప్పుడు జరగనుంది :
శాంసంగ్‌ గెలాక్సీ ఈవెంట్‌ సెప్టెంబర్‌ 4 వ తేదీ 5:30 am ET గంటలకు ప్రారంభం కానుంది. భారత్ కాలమానం ప్రకారం అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్‌, గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy Event 2025

లైవ్‌ ఎక్కడ చూడవచ్చు :
సెప్టెంబర్ 4 వ తేదీ జరగనున్న శాంసంగ్‌ గెలాక్సీ ఈవెంట్‌ ను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌, అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో లైవ్‌ ప్రసారం కానుంది. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌ విడుదలతోపాటు మరిన్ని కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌ కోసం ప్రీ లాంచ్‌ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

రిజర్వ్ చేసుకోవచ్చు :
శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌ samsung.com లేదా Shop Samsung App ద్వారా గెలాక్సీ ట్యాబ్‌ను రిజర్వ్‌ చేయవచ్చు. ఇలా రిజర్వ్‌ చేసుకున్న కస్టమర్‌లకు $50 (సుమారు రూ.4,400) లభిస్తుంది. గెలాక్సీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. కొత్త గెలాక్సీ ట్యాబ్లెట్స్ కొనుగోలు సమయాల్లో $950 (రూ.83,000) వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

గెలాక్సీ ట్యాబ్‌ S11 సిరీస్‌ :
ఈ శాంసంగ్‌ గెలాక్సీ ఈవెంట్‌ లో గెలాక్సీ ట్యాబ్‌ S11 సిరీస్‌ విడుదల అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో గెలాక్సీ ట్యాబ్‌ S11, గెలాక్సీ S11 అల్ట్రా మోడల్స్ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ప్లస్ వేరియంట్‌ లాంచ్‌ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

ఈ గెలాక్సీ ట్యాబ్‌ S11 సిరీస్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ట్యా్బ్లెట్‌ తోపాటు శాంసంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల కానుంది. ఈ సిరీస్‌ నుంచి ఆఖరిగా గెలాక్సీ S25 ఎడ్జ్ అందుబాటులోకి వచ్చింది.

గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ :
కొన్ని లీక్స్ ద్వారా గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ HD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు Exynos 2400 ప్రాసెసర్ ను కలిగి ఉండే అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 45W వైర్‌ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4900mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Event confirmed, galaxy S25 FE and Galaxy Tab 11 series expected
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X