Home
News

SAMSUNG Galaxy F12 మొదటి సేల్ మొదలైంది!! రూ.2000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు

ఇండియాలో శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ లకు మంచి డిమాండ్ ఉంది. వినియోగదారుల కోసం సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నది. అందులో భాగంగా ఇటీవల గెలాక్సీ F12 ను విడుదల చేసింది. రూ.10 వేల బడ్జెట్ విభాగంలో అద్భుతమైన ఫీచర్లతో విడుదలైన ఈ ఫోన్ ఈ రోజు మొదటి సారిగా అమ్మకానికి అందుబాటులోకి రానున్నది. ఇది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరియు శామ్‌సంగ్.కామ్ వెబ్ సైట్ ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12PM నుంచి వినియోగదాలు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ F12 ధరలు & సేల్స్ ఆఫర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ F12 ధరలు & సేల్స్ ఆఫర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ F12 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్ లలో విడుదల అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ యొక్క ధర రూ.10,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.11,999 ధరను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్లాక్, సీ గ్రీన్ మరియు స్కై బ్లూ వంటి కలర్ లలో లభిస్తుంది. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు ఫ్లిప్‌కార్ట్, శామ్‌సంగ్.కామ్ ద్వారా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.1000 వరకు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుల మీద 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. వీటితో పాటుగా నో-కాస్ట్ EMI ఎంపికలు ఉన్నాయి.

శామ్సంగ్ గెలాక్సీ F12 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ F12 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ F12 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ 3.1 కోర్‌లో రన్ అవుతుంది. అలాగే ఇది 6.5-అంగుళాల హెచ్‌డి + ఇన్ఫినిటీ-V డిస్ప్లేను 720x1,600 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తితో మరియు 90HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 Soc తో రన్ అవుతూ 4GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో f/ 2.0 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ f / 2.2 లెన్స్ 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ కెమెరా, f / 2.4 ఎపర్చరు మరియు f / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.

గెలాక్సీ F12 ఫోన్ 6,000mAh బ్యాటరీ ఫీచర్స్

గెలాక్సీ F12 ఫోన్ 6,000mAh బ్యాటరీ ఫీచర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ F12 స్మార్ట్ ఫోన్ యొక్క ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అలాగే కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ V5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. వీటన్నిటితో పాటు శామ్సంగ్ గెలాక్సీ F12 ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 6,000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F12 Smartphone First Sale Live on Flipkart and Samsung.com: Price, Specs, Features, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X