Samsung Galaxy F13 మొదటి సేల్ డేట్ వచ్చేసింది ! ధర ,ఆఫర్లు చూడండి.

By Maheswara
|

Samsung ఇటీవల భారతదేశంలో Galaxy F13 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ జూన్ 29న దేశంలో మొదటి సారి సేల్ కు సిద్ధంగా ఉంది. Samsung నుండి కొత్తగా ప్రారంభించబడిన ఈ హ్యాండ్‌సెట్ భారీ 6,000 mAh బ్యాటరీ, Exynos 850 SoC మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. భారతదేశంలో Galaxy F13 కోసం మొదటి సేల్ తేదీ మరియు లాంచ్ ఆఫర్‌ల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.

 

Samsung Galaxy F13 భారతదేశంలో మొదటి సేల్

Samsung Galaxy F13 భారతదేశంలో మొదటి సేల్

Samsung Galaxy F13 యొక్క మొదటి సేల్ ఈ నెల జూన్ 29 న మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ చేయబడింది. ఇది భారతదేశంలోని ఫ్లిప్‌కార్ట్ మరియు బ్రాండ్ యొక్క అధికారిక సైట్ ద్వారా సేల్ చేయబడుతుంది.ఈ పరికరాన్ని బేస్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.11,999, అయితే 4GB + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 12,999. గా నిర్ణయించబడింది.

లాంచ్ ఆఫర్

లాంచ్ ఆఫర్

అయితే లాంచ్ ఆఫర్ కింద రూ. 1,000 తక్షణ బ్యాంక్ తగ్గింపు ఆఫర్ ఉంది. అంటే, ప్రారంభ ధర రూ. 10,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇంకా, ఈ ఫోన్ నైట్‌స్కీ గ్రీన్, సన్‌రైజ్ కాపర్ మరియు వాటర్‌ఫాల్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Samsung Galaxy F13 ఫీచర్లు
 

Samsung Galaxy F13 ఫీచర్లు

Samsung Galaxy F13 6.6-అంగుళాల పూర్తి-HD+ (1080x2408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ పరికరం Exynos 850 SoC ద్వారా పని చేస్తుంది. 4GB RAM మరియు 128GB వరకు అంతర్గత నిల్వతో జత చేయబడింది. ఇది 1TB వరకు అదనపు స్టోరేజీ విస్తరణకు కూడా మద్దతు ఇస్తుంది.  ఇక ఈ ఫోన్ యొక్క కెమెరా వివరాలు గమనిస్తే, Samsung Galaxy F13 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 5MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి.

కెమెరాలు

కెమెరాలు

సెల్ఫీల కోసం, ఫోన్ ముందు భాగంలో 8MP కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఇది Android 12 OSతో నడుస్తుంది మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000 mAh బ్యాటరీని తీసుకువస్తుంది.ఈ  ఫోన్ పరిమాణం 165.4x76.9x9.3mm మరియు 207 గ్రాముల బరువు ఉంటుంది.ఇందులోని  కనెక్టివిటీ ని ఒకసారి గమనిస్తే, Galaxy F13లో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.

Samsung Galaxy F13: కొనడం విలువైనదేనా?

Samsung Galaxy F13: కొనడం విలువైనదేనా?

భారీ బ్యాటరీ, మంచి కెమెరా మరియు పెద్ద డిస్‌ప్లేతో కూడిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారికి Samsung Galaxy F13 ఒక మంచి ఫోన్ అని చెప్పవచ్చు. అయినప్పటికీ, ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌కు మాత్రమే మద్దతు ఇస్తుంది. అయితే Samsung ఈ ధరల శ్రేణి పరికరాలలో కూడా 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుందని గమనించగలరు.

Galaxy M52 5G స్మార్ట్ ఫోన్ పై ధర తగ్గింది

Galaxy M52 5G స్మార్ట్ ఫోన్ పై ధర తగ్గింది

అలాగే , Galaxy M52 5G స్మార్ట్ ఫోన్ పై రూ.10,000 ధర తగ్గింది! ఆఫర్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. సామ్‌సంగ్ గత ఏడాది మిడ్-రేంజ్ లో గెలాక్సీ M52 5Gని భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పై ఇప్పుడు రూ.10,000 వరకు తగ్గింపును పొందింది. దేశంలో Galaxy M52 5G స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 778G SoC, 5,000 mAh బ్యాటరీ యూనిట్ మరియు మరిన్నింటితో వస్తుంది. ఈ ఆఫర్‌ను పొందేందుకు మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను ఎక్కడ కొనుగోలు చేయాలో ఇక్కడ వివరాలు తెలుసుకోండి.

రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో

రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో

Samsung Galaxy M52 5G స్మార్ట్ ఫోన్ పై రూ. 9,000 వరకు ధర తగ్గింపు Samsung Galaxy M52 5Gని విడుదల చేసిన ధర రూ.29,999, బేస్ 6GB RAM + 128GB నిల్వ కోసం  ఇది ఇప్పుడు రూ.20,999  కి అందుబాటులో ఉంది. ఇదే వేరియంట్‌ను రూ.24,999.కి  Amazonలో పొందుపరచబడింది. కానీ, మీరు ధర తగ్గింపు ఆఫర్స్ తో Galaxy M52 5Gని కొనాలనుకుంటే మీరు రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి రూ. 20,999 కు కొనుగోలు చేయవచ్చు.

ఈ ఆఫర్ మీకు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. మరోవైపు, హై-ఎండ్ 8GB RAM + 128GB ROM ఎంపికపై రూ. 10,000 వరకు  ధర తగ్గింపు ఉంది. దీని అసలు ధర రూ. 31,999  కానీ, ఇప్పుడు రూ.21,999 కి కొనుగోలు చేయవచ్చు. రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో. ఇంకా, Galaxy M52 5G బ్లేజింగ్ బ్లాక్ మరియు ఐసీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

samsung యొక్క ఇతర ఆఫర్లు

samsung యొక్క ఇతర ఆఫర్లు

ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా samsung యొక్క ఇతర ఆఫర్లను కూడా ఒకసారి గమనించండి.శామ్సంగ్ బ్రాండ్ యొక్క గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనీ ప్రతి ఒక్కరు కూడా చుస్తూఉంటారు వారికి ఇప్పుడు samsung సంస్థ గొప్ప ఆఫర్ ని ప్రకటించింది. 24 నెలల చెల్లుబాటుతో నో కాస్ట్ EMI ఆఫర్‌ను శామ్సంగ్ సంస్థ ఇప్పుడు ప్రకటించింది. HDFC బ్యాంక్ భాగస్వామ్యంతో గెలాక్సీ Z ఫోల్డ్3 5G, గెలాక్సీ Z ఫ్లిప్ 3 5G అలాగే గెలాక్సీ S22 సిరీస్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారందరికీ కూడా ఈ సరికొత్త ఆఫర్ మొట్టమొదటిసారి అందుబాటులో ఉంది. భారతదేశంలోని శామ్సంగ్ బ్రాండ్ యొక్క రిటైల్ అవుట్‌లెట్‌లలో కూడా ఈ ఆఫర్ ని పొందవచ్చు. 

Best Mobiles in India

English summary
Samsung Galaxy F13 First Sale Will Be On June 29 Through Flipkart. Price And Offers Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X