Home
News

తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్ల తో కొత్త 5G ఫోన్! మార్చి 24 న లాంచ్!

By Maheswara

శాంసంగ్ సంస్థ తన 5G ఫోన్ల పోర్ట్ ఫోలియో లో మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయాలని యోచిస్తోంది.ఈ గెలాక్సీ F14 స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 24న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ 5nm ఎక్సీనోస్ 1330 చిప్‌సెట్, భారీ 6,000mAh బ్యాటరీ మరియు 13 5G బ్యాండ్‌లకు సపోర్ట్‌తో వస్తుంది, అందమైన 6.6-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ F14 డిజైన్ మరియు స్పెసిఫికేషన్‌ల వివరాలు, ఈ ఫోన్ ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో 6.6 అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే రిఫ్రెష్ రేట్ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు, కానీ ఇది M14 లాగా 90Hz ఉండవచ్చని అంచనాలున్నాయి.

Samsung Galaxy F14 5G Smartphone Set To Launch On March 24, Expected Price,Specifications Details

ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ మరియు ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు గమనిస్తే, ఇది శాంసంగ్ యొక్క అంతర్గత 5nm ఎక్సీనోస్ 1330 SoCతో వస్తుంది మరియు ఇది గరిష్టంగా 6GB ర్యామ్ తో జత చేయబడుతుంది. దీని లో మెరుగైన మల్టీ టాస్కింగ్ కోసం అదనంగా 6GB వర్చువల్ ర్యామ్ ను మంజూరు చేయగల వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.

ఈ ఫోన్ 13 5G బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుంది, కాబట్టి మీరు దేశంలో ఎక్కడైనా సరైన 5G కవరేజీని కలిగి ఉంటారని హామీ ఇవ్వబడింది. ఈ ఫోన్ యొక్క భారీ డిస్ప్లే మరియు ర్యామ్ ను అదే రీతిలో అధిక పనితీరు కోసం, భారీ 6,000mAh బ్యాటరీ మరియు ఫోన్ 25W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ వన్ UI 5.0తో ఆండ్రాయిడ్ 13 OS తో బూట్ అవుతుంది. అలాగే, ఈ ఫోన్ 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లను మరియు 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుందని సంస్థ తెలియచేస్తోంది. ఇది బడ్జెట్ ధర సెగ్మెంట్‌ యొక్క వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న పరికరం అయినందున, మార్కెట్లో దీనిపై భారీ అంచనాలున్నాయి.

ఇక ఈ ఫోన్ యొక్క కెమెరా సెటప్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. కానీ, 50MP ప్రైమరీ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరాతో కూడిన M14 యొక్క ఆప్టిక్స్ ఆధారంగానే F14 కూడా ఉండవచ్చు అని అంచనాలున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ F14 ధర మరియు లభ్యత వివరాలను పరిశీలిస్తే, ఈ పరికరం యొక్క క్రియేటివ్‌ ప్రకటనలలో ఉన్న ఫైన్ ప్రింట్ ప్రకారం గెలాక్సీ F14 స్మార్ట్ ఫోన్ దాదాపు ₹10,000-₹15,000 ధర ల మార్కెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు సూచిస్తుంది. గత వివరాలు గుర్తుకు తెచ్చుకుంటే, గత సంవత్సరం గెలాక్సీ F13 రూ.12,000తో లాంచ్ అయింది దీనితో పోలిస్తే ప్రస్తుత గెలాక్సీ F14 కూడా ఇదే ధర లేదా తక్కువ ఉండే అవకాశం ఉంది.

ఈ గెలాక్సీ F14 శాంసంగ్ యొక్క అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ దిగ్గజం Flipkart మరియు ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి మీకు అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F14 5G Smartphone Set To Launch On March 24, Expected Price,Specifications Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X