ధర రూ.12,990 కే, కొత్త శాంసంగ్ 5G ఫోన్ లాంచ్! సేల్ తేదీ వివరాలు
భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ F14 5G ధర,సేల్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ఈ రోజు భారతదేశంలో లాంచ్ చేయబడింది. మరియు ప్రస్తుతం ఉన్న గెలాక్సీ F13 స్థానంలో ఇది వస్తుంది. ఈ సరికొత్త గెలాక్సీ F సిరీస్ ఫోన్ పెద్ద 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే, 15Wకి బదులుగా 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.
ఇంకా, ఈ ఫోన్ యొక్క ముఖ్యవివరాలు గమనిస్తే ఇది పెద్ద f/1.8 ఎపర్చర్‌తో వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరాను కూడా పొందుతుంది. ఇది మంచి లైటింగ్ పరిస్థితుల్లో కొన్ని ఆకట్టుకునే ఫోటోలను తీయడానికి దారి తీస్తుంది. ఈ కొత్త శాంసంగ్ F సిరీస్ ఫోన్ బాక్స్ వెలుపల సరికొత్త ఆండ్రాయిడ్ 13 OSలో నడుస్తుంది మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F14 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్‌లు, ధర మరియు సేల్ వివరాలను ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ F14 5G ధర 4GB + 128GB వేరియంట్ కు రూ. 12,990 మరియు 6GB + 128GB మోడల్‌కు రూ.14,990 గా ఉంది. ఇవి పరిచయ ధరలు అని గమనించండి, అంటే Samsung ఏదో ఒక సమయంలో ధరలను మార్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ అమ్మకాలు మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు IST ఫ్లిప్‌కార్ట్ మరియు సామ్‌సంగ్ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభమవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ F14 5G స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్ల వివరాలు, ఈ ఫోన్ 4GB/6GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో జత చేయబడిన ఇన్-హౌస్ ఎక్సీనోస్ 1330 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. దీని స్టోరేజీని మైక్రో SD కార్డ్ ద్వారా మరింత విస్తరించవచ్చు. ఈ ఫోన్ మెరుగైన మల్టీ టాస్కింగ్ కోసం 6GB వరకు పొడిగించదగిన RAMకి మద్దతు ఉంది. ఇక,కనెక్టివిటీ విషయంలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ మరియు USB టైప్-C పోర్ట్ లు ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OneUI కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది. స్పష్టమైన వాయిస్ కాల్‌ల కోసం AI వాయిస్ బూస్ట్, అనుకూలంగా సెట్ చేసుకోవడానికి కాల్ బ్యాక్‌గ్రౌండ్, స్టేక్డ్ విడ్జెట్‌లు, స్ప్లిట్ వ్యూతో మల్టీ టాస్కింగ్, ఫోన్‌ల మధ్య శీఘ్ర భాగస్వామ్యం, ప్రైవసీ & సెక్యూరిటీ డ్యాష్‌బోర్డ్ మరియు మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్‌లకు ఈ సాఫ్ట్‌వేర్ మద్దతును అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ F14 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే, సెల్ఫీ షూటర్‌ను ఉంచడానికి వాటర్‌డ్రాప్ నాచ్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లేయర్‌ని కలిగి ఉంది. ఈ పరికరం యొక్క అతిపెద్ద ముఖ్యాంశాలలో ఒకటి, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో పెద్ద 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఇక కెమెరా విషయానికొస్తే, శాంసంగ్ గెలాక్సీ F14 5G వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది, f/1.8 ఎపర్చరు మరియు LED ఫ్లాష్‌తో 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ మరియు మాక్రో యూనిట్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు (IST) ఫ్లిప్‌కార్ట్ మరియు సామ్‌సంగ్ వెబ్‌సైట్ ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయి.


Click it and Unblock the Notifications








