Home
News

50MP కెమెరా తో ,ఈ Samsung స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.12,248 కే! సేల్ వివరాలు

శాంసంగ్ నుంచి గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ Amazon సేల్ లో ఇప్పుడు భారీ తగ్గింపు ఆఫర్ తో అందుబాటులో ఉంది. అంటే 6000mAh బ్యాటరీ, డైమెన్సిటీ చిప్‌సెట్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే వంటి అనేక గొప్ప ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. ఇప్పుడు, ఇక్కడ Samsung Galaxy F15 5G ఫోన్ యొక్క ఆఫర్‌లు మరియు ప్రత్యేక ఫీచర్లను నిశితంగా పరిశీలిద్దాం.

ప్రస్తుతం, Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్ ధర Amazon లో 18 శాతం తగ్గింపుతో రూ.13,998 కు అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1750 తగ్గింపు కూడా ఉంది. కాబట్టి ఈ ఫోన్ ను మీరు రూ.12,248 కే కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F15 5g

Samsung Galaxy F15 5G స్పెసిఫికేషన్‌ల వివరాలు:
ఈ శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్‌సెట్ ని కలిగి ఉంది. కాబట్టి మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లో అన్ని యాప్‌లను సజావుగా ఉపయోగించవచ్చు.

ముఖ్యంగా, శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ 13 5G బ్యాండ్‌లకు మద్దతుతో వస్తుంది. అలాగే ఫోన్ ఆండ్రాయిడ్ 14లో నడుస్తుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ 4 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను మరియు 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని వాగ్దానం చేయబడింది.

అలాగే, అద్భుతమైన శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ (sAMOLED) డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే, దీని డిస్ప్లే 2340 x 1080 పిక్సెల్స్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు మెరుగైన భద్రతను కలిగి ఉంది. కాబట్టి ఈ ఫోన్ అత్యుత్తమ స్క్రీన్ అనుభవాన్ని అందిస్తుంది.

ఈ అద్భుతమైన శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన కెమెరా + 5MP కెమెరా + 2MP కెమెరా యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 13MP కెమెరా కూడా ఉంది. ఇది కాకుండా LED ఫ్లాష్ మరియు అనేక ఇతర ఫీచర్లను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F15 5G ఫోన్ 6000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కాబట్టి శాంసంగ్ గెలాక్సీ F15 5G ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు ఛార్జింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే ఇది సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి ఈ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా, ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్‌లో 5G, డ్యూయల్ 4G VoltE, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-సి పోర్ట్‌తో సహా వివిధ కనెక్టివిటీ మద్దతు ఫీచర్లు ఉన్నాయి. మరియు ఈ ఫోన్ బరువు 217 గ్రాములు గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F15 5g Smartphone Available With Huge Discount In Flipkart Big Bachat Days Sale.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X