శాంసంగ్ నుంచి కొత్త F సిరీస్ స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు..!
శాంసంగ్ గెలాక్సీ F-సిరీస్ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్‌లో విడుదల కానుంది. శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F15 5G) విడుదలపై ఇప్పటివరకు విడుదల తేదీని సంస్థ ప్రకటన చేయలేదు. అయితే శాంసంగ్ ఇండియా సపోర్టుతో పేజీ ఈ ఫోన్ వివరాలను పొందుపరిచింది. తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
శాంసంగ్ ఇండియా సపోర్టు పేజీలో ఈ ఫోన్ SM-E156B/DS మోడల్ నంబర్‌తో కనిపించింది. అయితే శాంసంగ్ గెలాక్సీ F15 5G హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫోటోలను సంస్థ విడుదల చేయలేదు. కానీ ఈ ఫోన్ 5G, డ్యూయల్ సిమ్‌ను సపోర్టు చేస్తుందని మాత్రం తెలిసింది.

ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వెబ్‌సైట్‌లో SM-E156B మోడల్‌తో కలిపించింది. ఫలితంగా త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ F15 స్మార్ట్‌ఫోన్.. గెలాక్సీ A15 5G కొంచెం పోలి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ A15 స్మార్ట్‌ఫోన్ గత డిసెంబర్‌లో విడుదలైంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ రూ.19,499గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్.. గెలాక్సీ A15 5G తరహా ఫీచర్లను కలిగి ఉంటే అవకాశం ఉంది. ఈ F15 5G హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీ సామర్థ్యా్న్ని కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 50MP ప్రధాన కెమెరా, USB-C పోర్టు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F15 హ్యాండ్‌సెట్.. A15 5G తరహా ఫీచర్లను కలిగి ఉంటే అవకాశం ఉంది. అయితే A15 5G ఎలాంటి ఫీచర్లను కలిగి ఉందంటే.. శాంసంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5 పైన పనిచేస్తుంది. మరియు ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో రానుంది. అలాగే ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరాతోపాటు 5MP, 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 13MP కెమెరాను కలిగి ఉంటుంది. వీటితోపాటు మరిన్ని కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.
అయితే శాంసంగ్ కొత్త F- సిరీస్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ F15 5G.. భారత్ మార్కెట్‌లో త్వరలోనే విడుదల కానుందని వివిధ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లు, శాంసంగ్ ఇండియా లైవ్ పేజీ ఆధారంగా తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందనే సమాచారం సహా స్పెసిఫికేషన్ల వివరాలను సంస్థ వెల్లడించలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








