Home
News

Samsung Galaxy F22 vs Redmi Note 10: ఈ రెండిటిలో మీ ఛాయస్ దేనికి??

ప్రముఖ కొరియన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ ఇటీవలి కాలంలో ఇండియాలో M- సిరీస్ డివైస్ ల నుండి A- సిరీస్ డివైస్ల వరకు విడుదల చేసింది. అలాగే రాబోయే ఒకటి లేదా రెండు నెలల్లో ఫోల్డబుల్స్ ఫోన్లను లాంచ్ చేయవచ్చు అని పుకార్లు ఉన్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ F22 యొక్క సరికొత్త స్మార్ట్ ఫోన్ యొక్క బేస్ మోడల్‌ రూ.12,499 ధర వద్ద విడుదలైంది. అలాగే ఇది వివిధ వేరియంట్‌లలో వివిధ ఆఫర్‌లలో లాంచ్ అయింది. అయితే అదే విభాగంలో శామ్‌సంగ్ గెలాక్సీ F22 కి పోటీగా షియోమి స్మార్ట్ ఫోన్ సంస్థకు చెందిన షియోమి రెడ్మి నోట్ 10 ఫోన్ రూ.12,999 ధర వద్ద లాంచ్ అయింది. ఈ రెండు ఫోన్ల మధ్య గల వ్యత్యాసం గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ F22 vs రెడ్మి నోట్ 10 డిస్ప్లే

శామ్‌సంగ్ గెలాక్సీ F22 vs రెడ్మి నోట్ 10 డిస్ప్లే

శామ్సంగ్ గెలాక్సీ F22 ఫోన్ 6.20-అంగుళాల డిస్ప్లేను 720 × 1600 లేదా HD + రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. అయితే దీనికి విరుద్ధంగా రెడ్‌మి నోట్ 10 ఫోన్ 6.00 అంగుళాల డిస్ప్లేను 2400 x 1080 లేదా FHD + రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. ఈ రెండు పరికరాలు కూడా AMOLED ప్యానెల్లను కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ బేసి లాభం మరియు నష్టం సిద్ధాంతం కూడా ఉంది. ఎందుకంటే శామ్‌సంగ్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను అందిస్తుండగా రెడ్‌మి నోట్ 10 మాత్రం 60Hz ప్యానెల్‌ను మాత్రమే కలిగి ఉండి అధిక రిజల్యూషన్‌తో వస్తుంది. కాబట్టి కంటెంట్ వినియోగదారులు శామ్‌సంగ్‌పై రెడ్‌మిని ఎంచుకోవచ్చు .

శామ్‌సంగ్ గెలాక్సీ F22 vs రెడ్మి నోట్ 10: డిజైన్

శామ్‌సంగ్ గెలాక్సీ F22 vs రెడ్మి నోట్ 10: డిజైన్

డిజైన్ విషయానికి వస్తే శామ్సంగ్ గెలాక్సీ F22 ఫోన్ కెమెరా మాడ్యూల్ కోసం సరికొత్త శామ్‌సంగ్ డివైస్ లను గుర్తుచేస్తుంది. అయితే వెనుక ప్యానెల్ కొంచెం తక్కువ ఖర్చును కలిగి ఉండి కొన్ని పాత శామ్‌సంగ్ హ్యాండ్‌సెట్‌లను పోలి ఉంటుంది. అలాగే రెడ్‌మి నోట్ 10 ఫోన్ యొక్క డిజైన్ విషయంలో వెనుక భాగంలో గాజుతో కూడిన మృదువైన టచ్ ఫీల్‌తో నిర్మించబడి ఉంటుంది. ఇది అధిక ప్రీమియం హ్యాండ్ ఫీల్‌ను అనుమతిస్తుంది. అయితే అధిక బరువును కలిగి ఉన్న అనుభవాన్ని అందివ్వదు.

శామ్సంగ్ గెలాక్సీ F22

శామ్సంగ్ గెలాక్సీ F22 ఫోన్ డెనిమ్ బ్లాక్ మరియు డెమిన్ బ్లూ అనే రెండు కలర్ ఎంపికలలో వస్తుంది. అయితే రెడ్మి నోట్ 10 ఫోన్ ఫ్రాస్ట్ వైట్, షాడో బ్లాక్ మరియు ఆక్వా గ్రీన్ వంటి మూడు వేర్వేరు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ రెండు పరికరాల్లో డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ల కంటే సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ F22 vs రెడ్మి నోట్ 10: ప్రాసెసర్‌ పనితీరు

శామ్‌సంగ్ గెలాక్సీ F22 vs రెడ్మి నోట్ 10: ప్రాసెసర్‌ పనితీరు

శామ్‌సంగ్ గెలాక్సీ F22 ఫోన్ హుడ్ కింద మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అలాగే షియోమి రెడ్‌మి నోట్ 10 స్నాప్‌డ్రాగన్ 678 ప్రాసెసర్‌తో రన్ అవుతూ ఉంటుంది. అలాగే రెడ్‌మి నోట్ 10s ఫోన్ మీడియాటెక్ G95 ను కలిగి ఉంటుంది. వీటి పనితీరు విషయానికి వస్తే శామ్సంగ్ గెలాక్సీ F22 రెండు వేరియంట్లలో విక్రయించబడింది. అవి 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ లలో లభిస్తూ ఉండగా రెడ్మి నోట్ 10 లో కూడా ఇదే వేరియంట్ల వద్ద లభిస్తున్నది.

శామ్‌సంగ్ గెలాక్సీ F22 vs రెడ్మి నోట్ 10: బ్యాటరీ

శామ్‌సంగ్ గెలాక్సీ F22 vs రెడ్మి నోట్ 10: బ్యాటరీ

బ్యాటరీ విషయానికి వస్తే శామ్సంగ్ హ్యాండ్‌సెట్ 6000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అయితే ఇది 25W వరకు ఛార్జ్ చేయగలదు. కానీ బాక్స్ 15W ఛార్జర్‌ను కలిగి ఉంటుంది. దీనికి విరుద్ధంగా రెడ్‌మి నోట్ 10 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందిస్తుంది. రెండు పరికరాలు Android 11 లో రన్ అవుతాయి. మునుపటి బూటింగ్ OneUI మరియు తరువాతి బూటింగ్ MIUI 12.

శామ్‌సంగ్ గెలాక్సీ F22 vs రెడ్మి నోట్ 10: కెమెరా వ్యత్యాసం

శామ్‌సంగ్ గెలాక్సీ F22 vs రెడ్మి నోట్ 10: కెమెరా వ్యత్యాసం

ఆప్టిక్స్ విషయానికొస్తే శామ్సంగ్ గెలాక్సీ F22 ఫోన్ 48MP ప్రాధమిక సెన్సార్‌ను, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ లతో పాటుగా అదనంగా మరొక రెండు కెమెరాలతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే రెడ్‌మి నోట్ 10 ఫోన్ 48MP ప్రాధమిక సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెటప్‌ను అందిస్తుంది. వీటితో పాటుగా మరో రెండు సెన్సార్లు కూడా కలిగి ఉన్నాయి. ముందు వైపు రెండు ఫోన్ లు 13MP సెల్ఫీ స్నాపర్‌ను ఉపయోగించుకుంటాయి.

శామ్‌సంగ్ బ్రాండ్

రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే వీటి మధ్య అతి పెద్ద తేడాలు ఏమి లేవు. వీటిలో ఒకదాన్ని ఎన్నుకోమని చెబితే కనుక వారు సాఫ్ట్‌వేర్ మద్దతు మరియు శామ్‌సంగ్ బ్రాండ్ విలువ కంటే మెరుగైన బిల్డ్ మరియు కొన్ని ప్రముఖ ఫీచర్ల మధ్య ఎంచుకోవలసి ఉంటుంది. మీరు శామ్‌సంగ్ మరియు దాని ఉత్పత్తులను ఇష్టపడితే కనుక శామ్‌సంగ్ గెలాక్సీ F22 ను ఎంచుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F22 vs Redmi Note 10: Which One is Best Budget Phone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X