Samsung Galaxy F23 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

సామ్ సంగ్ గెలాక్సీ F23 5G స్మార్ట్‌ఫోన్ నేడు భారతదేశంలో గ్రాండ్ గా లాంచ్ చేయబడింది. ఇది గత సంవత్సరం ప్రారంభించబడిన గెలాక్సీ F22కి అప్ గ్రేడ్ సక్సెసర్‌గా వస్తుంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G SoC ద్వారా శక్తిని పొందుతూ ట్రిపుల్ రియర్ కెమెరా మరియు వాయిస్ ఫోకస్ ఫీచర్‌లతో ప్రీలోడ్ చేయబడి ఉంటుంది. ఇది కాల్‌లు చేసేటప్పుడు పరిసర ప్రాంతాలలో గల శబ్దాన్ని తగ్గించడంలో మరియు వాయిస్‌ని పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. 120Hz డిస్‌ప్లే, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 12-బ్యాండ్ 5G కనెక్టివిటీ వంటి ముఖ్యమైన ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ ఇండియా మార్కెట్ లో Redmi Note 11T 5G, iQoo Z3 మరియు Realme 9 Pro 5G వంటి వాటికి గట్టిపోటీని ఇస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Samsung Galaxy F23 5G ధరల వివరాలు

Samsung Galaxy F23 5G ధరల వివరాలు

భారతదేశంలో సామ్ సంగ్ గెలాక్సీ F23 5G ఫోన్ రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.17,499 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.18,499. ఈ ఫోన్ ఆక్వా బ్లూ మరియు ఫారెస్ట్ గ్రీన్ వంటి రెండు కలర్ ఎంపికలలో వస్తుంది. ఇది మార్చి 16 మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart, Samsung.com మరియు దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన రిటైల్ స్టోర్‌లలో మొదటిసారి విక్రయించబడుతుంది.

సామ్ సంగ్ గెలాక్సీ F23 5G లాంచ్ ఆఫర్‌లు

సామ్ సంగ్ గెలాక్సీ F23 5G లాంచ్ ఆఫర్‌లు

సామ్ సంగ్ గెలాక్సీ F23 5G యొక్క లాంచ్ ఆఫర్‌లలో భాగంగా ICICI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లకు రూ.1,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే రెండు నెలల YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ప్రారంభ ధర 4GB + 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.15,999 మరియు 6GB + 128GB స్టోరేజ్ ఎంపిక కోసం రూ.16,999. ఈ ప్రారంభ ధర ఎంతకాలం అమలులో ఉంటుందనే వివరాలు వెల్లడించలేదు.

సామ్ సంగ్ గెలాక్సీ F23 5G స్పెసిఫికేషన్స్
 

సామ్ సంగ్ గెలాక్సీ F23 5G స్పెసిఫికేషన్స్

సామ్ సంగ్ గెలాక్సీ F23 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) 5G స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 పై వన్ UI 4.1తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు రెండేళ్లపాటు OS అప్‌గ్రేడ్‌లు మరియు నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందుతాయని హామీ ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో 6.6-అంగుళాల ఫుల్-HD+ ఇన్ఫినిటీ-U డిస్ప్లేను కలిగి ఉంది. అలాగే హుడ్ కింద ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G SoCతో పాటు గరిష్టంగా 6GB RAMతో జతచేయబడి లభిస్తుంది. 6GB వర్చువల్ RAM విస్తరణ మద్దతు కూడా ఉంది. ఇది మెమరీ సామర్థ్యాన్ని వాస్తవంగా విస్తరించడానికి ఇంటర్నల్ స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

ఆప్టిక్స్

సామ్ సంగ్ గెలాక్సీ F23 5G యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ సామ్ సంగ్ ISOCELL JN1 ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ

సామ్ సంగ్ గెలాక్సీ F23 5G ఫోన్ 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS, NFC, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. NFCలో Samsung Pay సపోర్ట్‌తో కూడా ఫోన్ వస్తుంది. ఇంకా మెరుగైన ఆడియో ప్లేబ్యాక్ కోసం డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. అలాగే ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పబడే అడాప్టివ్ పవర్ సేవింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy F23 5G Smartphone Released in India With 120Hz Display: Price, Specs, Sales Date, Launch Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X