50MP OIS కెమెరా, 6000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఆగస్టు 7న విడుదల.. !!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ త్వరలో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. Galaxy F34 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 7న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ కొత్త ఫోన్‌లో కెమెరా పనితీరు ఆకట్టుకుంటుందని సంస్థ తెలిపింది. ప్రధాన కెమెరా OISతో వస్తుందని పేర్కొంది. 6000mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది.
శాంసంగ్ గెలాక్సీ F34 5G స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంటుంది. దీంతోపాటు విజన్ బూస్టర్ టెక్నాలజీ మరియు 1000nits బ్రైట్‌నెస్‌తో వస్తుందని పేర్కొంది. F34 స్మార్ట్‌ఫోన్ ప్రీమియం సిగ్నెచర్ గెలాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో మాత్రమే ఉండే.. నైటోగ్రఫీ ఫీచర్.. శాంసంగ్ గెలాక్సీ F34 ఫోన్ కూడా కలిగి ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. 50MP ప్రైమరీ కెమెరా OIS టెక్నాలజీని కలిగి ఉంటుంది. 8MP ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, LED ప్లాష్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 13MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దాంతోపాటు ఫన్ మోడ్‌ను కలిగి ఉంటుంది.
ఒకే సమయంలో నాలుగు వీడియోలు, నాలుగు ఫోటోలు తీయగలిగే సింగిల్ టేక్ ఫీచర్ ఈ ఫోన్లు కలిగి ఉన్నాయని శాంసంగ్ తెలిపింది. 16 వివిధ ఇన్‌బిల్ట్ లెన్స్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ నో షేక్ కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఆస్పష్టంగా ఉన్న ఫోటోలను తొలగిస్తుంది. ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వారికి ఈ ఫోన్ కెమెరాల పనితీరు ఆకట్టుకుంటుందని తెలిపింది.

గెలాక్సీ F34 5G స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని సంస్థ చెబుతోంది. ఈ ఫోన్ ఎలక్ట్రిక్ బ్లాక్, మైస్టిక్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 6GB, 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మిగిలిన వేరియంట్ల వివరాలు తెలియాల్సి ఉంది.
వాయిస్, వీడియో కాల్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించే ఫీచర్ కూడా ఈ ఫోన్ సొంతమని సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్‌తో రానుందని పేర్కొంది. 4 జెనరేషన్ OS అప్‌గ్రేడ్, 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లు ఇస్తామని శాంసంగ్ తెలిపింది.
గెలాక్సీ F34 ఫోన్ శాంసంగ్ వాలెట్‌తో వస్తుందని, ట్యాప్ అండ్ పే ఫీచర్‌ను కలిగి ఉంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు స్టోర్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతోపాటు గెలాక్సీ F34 స్మార్ట్‌ఫోన్ డిఫెన్స్ గ్రేడ్ నాక్స్ సెక్యూరిటీని కలిగి ఉంటుందని తెలిపింది.
ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, టైప్ - C పోర్టు, డ్యూయల్ సిమ్, 5G, వైఫై 6 802.11ax, బ్లూటూత్ 5.2, GPS సహా ఇతర అనేక మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధరపై శాంసంగ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే 20000 రూపాయల కంటే తక్కువ ధర కలిగి ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్టు ద్వారా అందుబాటులోకి రానుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








