Samsung కొత్త సిరీస్ ఫోన్ 'Galaxy F41'....! ఈరోజే లాంచ్ ధర ,ఫీచర్లు తెలుసుకోండి .
Samsung నుంచి కొత్త సిరీస్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ F41, ఈ రోజు భారతదేశంలో లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ ద్వారా శామ్సంగ్ సంస్థ 'గెలాక్సీ ఎఫ్' కొత్త సిరీస్ ను తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు టీజర్,ప్రమోషన్ వీడియో ల ద్వారా లీక్ అయ్యాయి.లీక్ అయిన వివరాల ప్రకారం శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 , 6,000 mAh బ్యాటరీ, సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే తో రాబోతోంది. ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ F41 ,6 జీబీ ర్యామ్ తో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం తో రావొచ్చని, లీక్ అయిన ఫీచర్ల ద్వారా తెలుస్తోంది.

శామ్సంగ్ గెలాక్సీ F41 లాంచ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్, భారతదేశంలో అంచనా ధర
శామ్సంగ్ గెలాక్సీ F41 లాంచ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం ఆన్‌లైన్‌లో శామ్‌సంగ్ ఇండియా సామాజిక ఖాతాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. రాబోయే శామ్‌సంగ్ గెలాక్సీ F41 ధర రూ. 15,000 నుండి రూ. 20,000.మధ్య ఉండొచ్చని అంచనా.

కొత్త పేరుతో రాబోతున్న శామ్‌సంగ్ గెలాక్సీ M31
ఈ F41 , కొత్త పేరుతో రాబోతున్న శామ్‌సంగ్ గెలాక్సీ M31 అని గతంలో చెప్పబడింది. దీని ధరపై అధికారిక వివరాలను కొన్ని గంటల్లో విడుదల కాబోతోంది.ఈ ఫోన్ లాంచ్ అయిన తరవాత ఫ్లిప్‌కార్ట్ మరియు శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకం జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్ శామ్‌సంగ్ గెలాక్సీ F41 ను టీజ్ చేస్తూ ఒక ప్రత్యేక పేజీని ప్రచురించింది. ఈ పేజీ ద్వారా ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్లను కూడా చేసుకోవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుందని పుకారు ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ F41 ఫీచర్లు (లీక్ అయినవి మరియు ఊహించినవి)
ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల చేసిన టీజర్‌ల ప్రకారం, సామ్‌సంగ్ గెలాక్సీ F41 సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే, సన్నని బెజెల్స్‌తో కలిగి ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పెద్ద 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు వెనుక వేలిముద్ర సెన్సార్‌ను కలిగి ఉందని టీజర్ ద్వారా తెలుస్తోంది.మరియు ఇది ఎక్సినోస్ 9611 SoC ప్రాసెసర్, 6GB RAM కలిగి ఉండటం, Android 10 తో రావడం ప్రత్యేక ఆకర్షణలు కావొచ్చు.

గెలాక్సీ ఎఫ్ 41 ఫాస్ట్ ఛార్జింగ్
ఈ ఫోన్ యుఎస్బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ మరియు ఫోన్లో సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉన్నట్లు సూచిస్తుంది. గెలాక్సీ ఎఫ్ 41 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని మరియు రెండు రకాల ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందించబడుతుందని లీక్ అయిన వివరాల ద్వారా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications







