రూ.1500 ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్లతో Samsung Galaxy F41 కొనుగోలుకు ఇదే సరైన సమయం...

|

శామ్సంగ్ స్మార్ట్ ఫోన్లను ఇష్టపడే వినియోగదారుల కోసం ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో జరుగుతున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సమయంలో కొన్ని అద్భుతమైన ఆఫర్లను అందుబాటులో తీసుకువసున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఇండియాలో విడుదల చేసిన శామ్సంగ్ గెలాక్సీ F41 ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి దీని కంటే మంచి తరుణం మరొకటి ఉండదు. ఫ్లిప్‌కార్ట్ లో లభించే అన్ని రకాల డిస్కౌంట్ ఆఫర్లు ప్రస్తుతం దీని కొనుగోలు మీద అందుబాటులో ఉంచబడింది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ స్నాపర్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, ఎక్సినోస్ 9611 SoC వంటి ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ F41 ఫ్లిప్‌కార్ట్ తగ్గింపు ధరల వివరాలు
 

శామ్‌సంగ్ గెలాక్సీ F41 ఫ్లిప్‌కార్ట్ తగ్గింపు ధరల వివరాలు

ఇండియాలో రెండు వేరియంట్ లలో లభించే శామ్‌సంగ్ గెలాక్సీ F41 ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.15,499 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ యొక్క ధర రూ.16,499. ఇది ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో ఫ్యూజన్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ మరియు ఫ్యూజన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలలో ఈ ఫోన్ మీద రూ. 1,500 ధర తగ్గింపును అందిస్తున్నారు.

Also Read: Rs.15000 లోపు LED స్మార్ట్ టీవీలపై అమెజాన్ లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్...

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో గెలాక్సీ F41 మీద డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో గెలాక్సీ F41 మీద డిస్కౌంట్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో భాగంగా శామ్‌సంగ్ గెలాక్సీ F41 కొనుగోలు మీద వినియోగదారులకు అదనంగా ప్రీపెయిడ్ లావాదేవీలపై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఎక్సచేంజ్ ఆఫర్ల మీద రూ.10,000 వరకు తగ్గింపు పొందవచ్చు. SBI కస్టమర్లు10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ కూడా ఆఫర్‌లో ఉంది. దీని ద్వారా వినియోగదారులు ఫోన్ ధరలో 70 శాతం చెల్లించి గెలాక్సీ ఎఫ్ 41 ను సొంతం చేసుకోగలుగుతారు. క్రెడిట్ కార్డులు మరియు క్రెడిట్ కార్డ్ EMI ల ద్వారా చేసిన పేమెంట్ ల కోసం ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. 12 నెలల వ్యవధి తరువాత వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు మరియు కొనుగోలు చేసిన ఫోన్‌ను తిరిగి ఇవ్వవలసి ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F41 6GB LPDDR4x RAM స్పెసిఫికేషన్స్
 

శామ్‌సంగ్ గెలాక్సీ F41 6GB LPDDR4x RAM స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ F41 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 లో వన్ యుఐ కోర్ తో రన్ అవుతుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలేడ్ ఇన్ఫినిటీ-U డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 6GB LPDDR4x RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉండి Exynos 9611 SoC చేత శక్తిని పొందుతుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి మెమొరిని 512GB వరకు విస్తరించడానికి ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ F41 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

శామ్సంగ్ గెలాక్సీ F41 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

శామ్సంగ్ గెలాక్సీ F41 స్మార్ట్ ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ స్నాపర్ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా మరియు లైవ్ ఫోకస్ సపోర్ట్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్ మూడవ కెమెరాను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ షూటర్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F41ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ & 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

శామ్‌సంగ్ గెలాక్సీ F41ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ & 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

శామ్‌సంగ్ గెలాక్సీ F41 ఫోన్ యొక్క ఇతర కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును ఇస్తూ 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ సామ్‌సంగ్ ఫోన్ వెనుకవైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అదనంగా కలిగి ఉంటుంది. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4 జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5.0, జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ మరియు 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy F41 Sale Live on Flipkart Big Billion Days With More Discount Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X