శామ్‌సంగ్ గెలాక్సీ F42 5G లాంచ్ అయింది!! ఫ్లిప్‌కార్ట్ సేల్లో ప్రత్యేక లాంచ్ ఆఫర్లు
భారతదేశంలోని మొబైల్ బ్రాండ్ లలో మంచి గుర్తింపు ఉన్న శామ్‌సంగ్ సంస్థ నేడు శామ్‌సంగ్ గెలాక్సీ F42 5G కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త శామ్‌సంగ్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 90Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్లను కలిగి ఉంది. భారతదేశంలో 5G కనెక్టివిటీతో వచ్చిన కంపెనీ గెలాక్సీ F- సిరీస్‌లో ఇది మొదటి ఫోన్ కావడం మరొక విశేషం. ఇది 12 విభిన్న బ్యాండ్‌లకు మద్దతును కలిగి ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ F42 5G ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో రన్ అవుతూ iQoo Z3, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ మరియు రియల్‌మి X7 5G ల ధరల విభాగంలో వీటికి పోటీగా లబిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ F42 5G ధరలు & సేల్స్ వివరాలు
భారతదేశంలో Samsung Galaxy F42 5G రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.20,999 కాగా 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.22,999. ఇది మ్యాట్ ఆక్వా మరియు మ్యాట్ బ్లాక్ కలర్స్ లలో లభిస్తుంది. ఈ శామ్‌సంగ్ గెలాక్సీ F42 5G ఫోన్ దేశంలో అక్టోబర్ 3 ఆదివారం నుండి ఫ్లిప్‌కార్ట్, శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మరియు దేశంలో ఎంచుకున్న రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా మొదటిసారి అమ్మకానికి రానున్నది. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా ఇది ప్రత్యేక పరిచయ ధరల వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. ఇందులో భాగంగా 6GB వేరియంట్ రూ.17,999 మరియు 8GB వేరియంట్ రూ.19,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే నో-కాస్ట్ EMI ఎంపికలు మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు కూడా ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ప్రత్యేక పరిచయ ధరలు పరిమిత కాలానికి చెల్లుబాటు అవుతుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F42 5G స్పెసిఫికేషన్స్
శామ్‌సంగ్ గెలాక్సీ F42 5G యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్11 లో One UI 3.1 తో రన్ అవుతుంది. అలాగే ఇది 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్ మరియు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో కలిగి ఉంది. ఈ ఫోన్ 8GB వరకు ర్యామ్‌తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ని కలిగి ఉంటుంది. వెనుక కెమెరా సెటప్ హైపర్‌లాప్స్, స్లో మోషన్, ఫుడ్ మోడ్, నైట్ మోడ్, పనోరమా మరియు ప్రో మోడ్‌తో సహా అనేక రకాల మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F42 5G ఫోన్ 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, USB Type-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అదనంగా ఈ ఫోన్ వైర్డు మరియు బ్లూటూత్ హెడ్‌ఫోన్‌ల ద్వారా అద్భుతమైన ధ్వని అనుభవాన్ని అందించడానికి డాల్బీ అట్మోస్ మద్దతును కలిగి ఉంది. అలాగే ఇది 15W బండిల్ వేగవంతమైన ఛార్జర్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ధరల వివరాలు
భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ఫోన్ మూడు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా మరొక 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ. 31,999. అయితే అమెజాన్ దీపావళి సేల్ లో పరిమిత కాలానికి శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G ప్రత్యేక ఆఫర్ ఉంది. పరిచయ ఆఫర్లలో భాగంగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999 మరియు 8GB ర్యామ్ + 128GB మోడల్ రూ.28,999 ధర వద్ద పొందవచ్చు. ఈ ఫోన్ బ్లేజింగ్ బ్లాక్ మరియు ఐసీ బ్లూ కలర్ వేరియంట్లలో వస్తుంది. ఇది అమెజాన్, Samsung.com మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా అక్టోబర్ 3 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ అమ్మకం తేదీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 కి అనుగుణంగా ఉంటుంది. అమెజాన్ ద్వారా గెలాక్సీ M52 5G కి ముందస్తు యాక్సెస్ కూడా ప్రైమ్ సభ్యులకు అందించబడుతుంది.


Click it and Unblock the Notifications