Home
News

108MP కెమెరా, 8GB ర్యామ్‌ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు.. బ్యాంకు కార్డులతో రూ.2500 అదనపు డిస్కౌంట్‌!

శాంసంగ్‌ గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్‌ 30000 ధర సెగ్మెంట్‌లో బెస్ట్‌ శాంసంగ్‌ ఫోన్‌గా ఉంది. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.29,999గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.24,999 కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజీ ప్రయోజనాల ద్వారా మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy F54 5G) కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ F54 ధర : ఈ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.24,999గా ఉంది. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ తగ్గింపును పొందుతారు.

Samsung Galaxy F54 5G price drop news

శాంసంగ్‌ షాప్‌ యాప్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 వరకు అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందుతారని సంస్థ చెబుతోంది. ఇందులో రిఫరల్‌ కోడ్‌ ద్వారా 5 శాతం డిస్కౌండ్‌, మొబిక్విక్‌ వాలెట్‌ ద్వారా 15 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చని చెబుతోంది. దీంతోపాటు నో కాస్ట్‌ EMI, ఎక్స్చేంజీ ఆఫర్లు కూడా ఉన్నట్లు పేర్కొంది.

ఫ్లిప్‌కార్డు ద్వారా ఈ శాంసంగ్‌ గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.2500 తగ్గింపు ధరను పొందే అవకాశం ఉంది. దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా రూ.22000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్టార్‌డస్ట్‌ సిల్వర్‌, మెటోర్‌ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F54 5G price drop news

శాంసంగ్‌ గెలాక్సీ F54 5G స్పెసిఫికేషన్లు : గెలాక్సీ F54 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌+ డిస్‌ప్లేను కలిగి ఉంది. అండర్‌ ది హుడ్‌ Exynos 1380 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OneUI 5.1 అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌గా వస్తుంది. నాలుగు సంవత్సరాలపాటు OS మరియు 5 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ F54 5G స్మార్ట్‌ఫోన్‌ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యా్న్ని కలిగి ఉంటుంది. మరియు వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) 108MPతో కూడిన ప్రధాన కెమెరా, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చారు.

ఈ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ సిమ్‌ను సపోర్టు చేస్తుంది. బ్లూటూత్‌ 5.3, వైఫై 5, NFC, USB-C ఛార్జింగ్‌ ఫోర్టును సపోర్టు చేస్తుంది. మరియు మైక్రో SD స్లాట్‌ను కలిగి ఉంది. అయితే ఈ తగ్గింపు ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందనే సమాచారం వెల్లడించలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy F54 5G smartphone gets price cut on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X