ఈ ఫోన్లను కొనాలంటే ఎన్ని రోజులు పనిచేయాలో తెలుసా ?

టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో ప్రజలంతా దాని వైపు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు సరికొత్తగా ఊపిరిపోసుకుంటున్నాయి. అధునాతన ఫీచర్లతో పాటు లేటెస్ట్ టెక్నాలజీని జోడి

|

టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో ప్రజలంతా దాని వైపు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు సరికొత్తగా ఊపిరిపోసుకుంటున్నాయి. అధునాతన ఫీచర్లతో పాటు లేటెస్ట్ టెక్నాలజీని జోడించుకుని మార్కెట్లోకి వస్తున్నాయి. మరి ఆ స్థాయిలో వస్తున్నాయంటే దాని ధరలు అదే స్థాయిలో ఉండాలి కదా. ఇప్పుడంతా ఫోల్డబుల్ ఫోన్ల మీద నడుస్తుండటంతో కంపెనీలు కూడా వాటిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటి ధరలను ఓ సారి పరిశీలిస్తే దాదాపు రూ. 70 వేలుగా ఉన్నాయని తెలుస్తోంది.

 
ఈ ఫోన్లను కొనాలంటే ఎన్ని రోజులు పనిచేయాలో తెలుసా ?

ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలో ఇప్పుడు శాంసంగ్ , హువాయి కంపెనీలు ముందు వరుసలో దూసుకువెళుతున్నాయి. వీటి ధరలు కూడా లక్షకు పైగానే ఉన్నాయి. ఈ ఫోన్ల ధరతో బయట ఏమి లభిస్తాయి, ఫోన్ కొనాలంటే ఎన్ని రోజులు పనిచేయాలనే దానిపై ఓ స్టడీలో ఆసక్తికర విషయాలు తెలిసాయి అవేంటో ఓ సారి చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్

ముంబైలో ఒక వ్యక్తి నెలకు రూ. 41 వేలు సంపాదిస్తే ఈ ఫోన్ కొనుగోలుకు అతడు మొత్తం 72.4 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ముంబై సిటిజన్ ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో 18.1 నెలలు వరకు నివసించవచ్చు. అలాగే ఆ అపార్ట్ మెంట్ కరెంటు బిల్లులను 50.6 నెలల వరకు చెల్లించవచ్చు. రీజనబుల్ రెస్టారెంట్లలో 692 సార్లు భోజనం చేయవచ్చు. 1106 దేశీయ బీర్లను తాగవచ్చట.

హువాయి మేట్ ఎక్స్

హువాయి మేట్ ఎక్స్

ఈ ఫోన్ కొనుగోలు చేసే డబ్బులతో ముంబై సిటిజన్ 95 రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే అపార్ట్ మెంట్లోని ఓ ఫ్లాట్ లో 23.7 నెలల పాటు నివసించవచ్చు. అపార్ట్ మెంట్ మొత్తం బిల్లులను 66.4 నెలల పాటు చెల్లించవచ్చు. రీజనబుల్ రెస్టారెంట్లలో 909 సార్లు భోజనం చేయవచ్చు. 1453 దేశీయ బీర్లను తాగవచ్చట.

57 దేశాల్లో 16 వ ప్లేస్
 

57 దేశాల్లో 16 వ ప్లేస్

మొత్తం 57 దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా ఇందులో ఇండియా 16వ స్థానంలో నిలిచిందని BankMyCell అనే స్టడీ తెలిపింది. స్టడీ నిర్వహించిన దేశాల్లో Addis Ababa in Ethiopia and Zurich in Switzerland వంటి దేశాలు కూడా ఉన్నాయి.

ధర అంచనా

ధర అంచనా

కాగా ఈ ఫోన్ల ధరలను ఓ సారి పరిశీలిస్తే శాంసంగ్ ఫోల్డ్ ఫోన్ ధర సుమారుగా లక్షా ముఫ్పై ఎనిమిది వేలుగా ఉంటుందని అంచనా. ఇక హువాయి మేట్ ఎక్స్ విషయానికి వస్తే సుమారుగా లక్షా ఎనభై ఒక వేయి అయిదు వందలుగా ఉంటుందని అంచనా..ఈ ఫోన్లే మార్కెట్లో ఇప్పుడు మోస్ట్ ఎక్సపెన్సివ్ గా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
People in India need to work 72.4 days to afford the new galaxy fold 95 days for the huawei mate x

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X