శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్..... ధరకు తగ్గ ఫీచర్స్ !!!!

|

శామ్సంగ్ ఎట్టకేలకు తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. మొదట దీనిని ఫిబ్రవరి నెలలో శాన్ ఫ్రాన్సిస్కొలో తన అన్‌ప్యాక్డ్ కార్యక్రమంలో ప్రకటించింది. చాలా ఆలస్యం తరువాత చివరకు ఇప్పుడు ఇండియాలో ఈ రోజు లాంచ్ చేసారు. దీని ధర మరి భారీగా రూ.1,64,999 లుగా నిర్ణయించబడింది. ఇండియాలో అధికారికంగా విక్రయించే మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలిచింది.

ధర వివరాలు
 

ధర వివరాలు

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్ లలో అందిస్తోంది. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌ గల స్మార్ట్‌ఫోన్ ధర 1,64,999 రూపాయలు. ఇది కాస్మోస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే వస్తుంది.

ఫెస్టివల్ సేల్స్ లో షియోమి ప్రభంజనం

ఆఫర్స్

ఆఫర్స్

గెలాక్సీ ఫోల్డ్ ప్రీమియర్ వన్-వన్ సర్వీస్‌ను ఫోల్డ్ కన్సైర్జ్ మరియు ఒక సంవత్సరం ఆక్సిడెంటల్ ప్రొటెక్షన్ తో పాటు వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌తో సహాయంతో వస్తుంది. అంతేకాక ఇది శామ్సంగ్ గెలాక్సీ బడ్స్ హెడ్‌ఫోన్‌లను ఉచితంగా అందిస్తుంది.

రిలయన్స్ జియో & ఎయిర్‌టెల్ ప్రియమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ప్రీ-బుకింగ్స్

ప్రీ-బుకింగ్స్

శామ్సంగ్ ఇండియాలో గెలాక్సీ ఫోల్డ్ ముందస్తు బుకింగ్ కోసం అక్టోబర్ 4, శుక్రవారం నుండి ప్రీ-బుకింగ్స్ ప్రారంభిస్తుంది. అక్టోబర్ 20 నుండి వీటిని వినియోగదారులకు అందించబడతాయి. ప్రీ-బుకింగ్స్ ఆన్‌లైన్‌లో సామ్‌సంగ్ ఈషాప్ ద్వారా మరియు ఆఫ్‌లైన్‌లో 35 నగరాల్లో ఎంపిక చేసిన 315 అవుట్‌లెట్లలో జరుగుతాయి.

షియోమి Mi బ్యాండ్ 4 ఫ్లాష్ సేల్స్.... ధర ఎంతో తెలుసా!!

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా కాకుండా శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ రెండు డిస్ప్లేలను కలిగి ఉంది. ఇందులో ఒకటి ఫ్లాట్ స్క్రీన్ ముందు భాగంలో ఉంది. మరొకటి లోపల స్క్రీన్‌తో మడతపెట్టే డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ డిస్‌ప్లేలో హెచ్‌డి + (840x1960 పిక్సెల్స్) రిజల్యూషన్స్, 21: 9 కారక నిష్పత్తితో 4.6-అంగుళాల సూపర్ అమోలెడ్ ప్యానెల్ తో వస్తుంది. మరోవైపు ఫోల్డబుల్ డిస్ప్లే 7.3-అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డైనమిక్ అమోలేడ్ ప్యానెల్ ను QXGA + (1536x2152 పిక్సెల్స్) రిజల్యూషన్‌ మద్దతుతో మరియు 4.2: 3 కారక నిష్పత్తితో వస్తుంది.

దిమాక్ ఖరాబ్ అయే ఆఫర్లతో అమ్మకానికి సిద్దమైన సరికొత్త గెలాక్సీ A50 & A30

ఆండ్రాయిడ్

గెలాక్సీ ఫోల్డ్ ఆండ్రాయిడ్ 9 పైని ట్వీక్డ్ వన్ యుఐ స్కిన్‌తో రన్ అవుతుంది. ఇది ఫోల్డబుల్ డిస్ప్లేలో యాప్ ల కొనసాగింపుకు మద్దతు ఇస్తుంది. ఇది 12GB RAM తో జతచేయబడి ఆక్టా-కోర్ SoC చేత పని చేస్తుంది. ఇందులో 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇంకా అధిక మెమొరీ పొందడానికి ఇందులో మైక్రో SD కార్డ్ స్లాట్ లేదు.

ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ తో గూగుల్ పిక్సెల్,శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

కెమెరా

ఆప్టిక్స్ విషయానికొస్తే శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ మరియు కవర్‌లో ఒకే సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో అల్ట్రా-వైడ్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో గల 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు డ్యూయల్ పిక్సెల్ AF లెన్స్‌తో గల 12 మెగాపిక్సెల్ సెన్సార్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఇది OIS మరియు వేరియబుల్ ఎఫ్ / 1.5 నుండి ఎఫ్ / 2.4 ఎపర్చర్‌కు మద్దతు ఇస్తుంది. 12-మెగాపిక్సెల్ సెన్సార్ గల మూడవ కెమెరా టెలిఫోటో PDAF, OIS తో వస్తుంది. ఇది 2X ఆప్టికల్ జూమ్‌ను ప్రారంభించే f / 2.4 లెన్స్. మరోవైపు గల ఫ్రంట్ ఫేసింగ్ డ్యూయల్ కెమెరా సెటప్ 10 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్ / 2.2 లెన్స్‌తో మరియు 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఎఫ్ / 1.9 లెన్స్‌తో RGB డెప్త్ సెన్సార్ ను కలిగి ఉంటాయి. ఫోన్ కవర్‌లో గల సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.2 లెన్స్‌తో 10 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 రివ్యూ:ప్లస్,మైనస్ మరియు ఎక్స్ ఫాక్టర్

కనెక్టివిటీ

శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై 6, బ్లూటూత్ V 5.0, GPS/ A-GPS, NFCమరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. ఇందులో డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, బేరోమీటర్, జియోమాగ్నెటిక్, గైరోస్కోప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కూడా కలిగి ఉంది.

తగ్గింపు ఆఫర్‌లతో టాటా స్కై సెట్-టాప్ బాక్స్‌లు

బ్యాటరీ

శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ 4,380 ఎమ్ఏహెచ్ సామర్థ్యం కలిగిన డ్యూయల్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది వైర్ తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. రివర్స్ ఛార్జింగ్‌ను ప్రారంభించడానికి వైర్‌లెస్ పవర్ షేర్ ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు 62.8x160.9x17.1 మిమీ మరియు ఫోల్డ్ చేయకముందు 117.9x160.9x7.6 మిమీ కొలతలను కలిగి ఉంటుంది. దీని యొక్క బరువు 276 గ్రాములు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy Fold Launched in India: Priced at Rs 1,64,999

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X