బీ రెడీ ..శాంసంగ్ మడతబెట్టే ఫోన్ ఇండియాకి వచ్చేస్తోంది 

By Gizbot Bureau
|

స్మార్ట్‌ఫోన్ ప్రియులంతా ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శాంసంగ్‌కు చెందిన మడతబెట్టే ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ఎట్టకేలకు భారత్‌లో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి శాంసంగ్ ఈ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విక్రయించనుంది. అయితే ప్రీ-బుకింగ్ విధానంలోనే ఈ ఫోన్‌ను శాంసంగ్ విక్రయించనుందని తెలిసింది. భారత్‌లో గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్ రిలీజై ఎంతో కాలమైనప్పటికీ ఇందులో ఉన్న పలు లోపాల వల్ల ఫోన్ మార్కెట్‌లోకి రావడం ఆలస్యమైంది. ఈ క్రమంలోనే అన్ని లోపాలను సరి చేసిన శాంసంగ్ తన గెలాక్సీ ఫోల్డ్ ఫోన్‌ను గత నెల కిందటే దక్షిణ కొరియా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇక త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ లభ్యం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ 
 

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ 

7.3 అంగుళాల క్యూఎక్స్‌జీఏ +డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే (4.2:3), ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లే (2152x1536) 362పీపీఐ

4.6" హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ కవర్ డిస్‌ప్లే (21:9), 720x1680, 399 పీపీఐ

12 జీబీ ర్యామ్+51 జీబీ అంతర్గత మెమొరీ

4జీ +5 జీ మోడల్స్

10 ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ అప్

సూపర్ స్లో-మో 720 పీ వీడియో సపోర్ట్ 960 ఎఫ్‌పీఎస్

స్లో మోషన్ 1080పీ వీడియో సపోర్ట్ 240 ఎఫ్‌పీఎస్

వైర్‌లైస్ చార్జింగ్ అండ్ చార్జ్ షేరింగ్

కవర్ డిస్‌ప్లే 4.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్

మెయిన్ డిస్‌ప్లే 7.3 అంగుళాల క్యూఎక్స్‌జీఏ ప్లస్ డైనమిక్ అమోలెడ్

సెల్పీ కెమెరాలు : 10 ఎంపీ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా, 8ఎంపీ ఆర్‌జీబీ డెప్త్ కెమెరా

రియర్‌ కెమెరాలు: 16 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా,12 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ టెలీఫొటో కెమెరా

ఆండ్రాయిడ్ 9 పై, 276 గ్రాముల బరువు,

ఎల్‌టీడీ మోడల్‌లో 4,380 ఎంఏహెచ్ డ్యూయల్ బ్యాటరీ, 5జీ మోడల్ బ్యాటరీ సామర్థ్యం 4235 ఎంఏహెచ్ డ్యూయల్ బ్యాటరీ

ధర

ధర

కంపెనీ దీని ధరను ఇండియాలో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రూ.1,40,760 ధ‌ర‌కు ఈ ఫోన్ భార‌త్‌లో వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంద‌ని తెలుస్తోంది.

తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

శాంసంగ్ నుంచి వచ్చిన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్‌ను మడతపెట్టినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్, ఓపెన్ చేసినప్పుడు 7.3 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఒకేసారి మూడు రకాల యాప్స్‌ను మల్టీటాస్కింగ్ చేయవచ్చు. స్క్రీన్స్ స్విచింగ్‌లో యాప్‌ ఎక్కడ ఆగిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభమౌతుంది. అంటే రెండు ఫోన్ల పనిని ఇదే చేసేస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy Fold to launch in India on October 1

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X