అద్భుతమైన అనుభూతిని అందిస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్

By Gizbot Bureau
|

శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ భారత మార్కెట్ లోకి విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ విడుదలతో భారత మార్కెట్లో మొదటి మడతపెట్టే సౌలభ్యం ఉన్న ఫోన్ గా శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ నిలిచిపోయింది. నిజానికి ఈ ఫోన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే మార్కెట్లోకి వచ్చింది. అయితే అప్పట్లో దీనిపై విపరీతమైన విమర్శలు రావడంతో శాంసంగ్ దాన్ని వెనక్కి తీసుకుని విమర్శలు వచ్చిన డిజైన్లకు తిరిగి మార్పులు చేసి తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ అద్భుతమైన పనితీరును కనపరుస్తోందని తెలుస్తోంది. యూజర్లు ఈ ఫోన్ ద్వారా మంచి అనుభూతిని పొందుతున్నారని సోషల్ మీడియా రివ్యూలను చూస్తే తెలిసిపోతోంది.

డిస్ ప్లే 

డిస్ ప్లే 

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్‌లో రెండు తెర‌లు ఉంటాయి. ఒక డిస్‌ప్లే 7.3 ఇంచ్ సైజ్ కాగా, మ‌రో డిస్‌ప్లే సైజ్ 4.6 ఇంచులుగా ఉంది. కాగా 7.3 ఇంచుల డిస్‌ప్లేను మ‌డ‌త‌బెట్టే విధంగా రూపొందించారు.ఈ ఫోల్డ‌బుల్ ఫోన్‌ను త‌యారు చేసేందుకు భిన్న ర‌కాల కాంపొనెంట్ల‌ను త‌యారు చేయాల్సి వ‌చ్చింద‌ని శాంసంగ్ తెలిపింది. 

ధర

ధర

కాగా ఈ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ధ‌రను శాంసంగ్ వెల్ల‌డించ‌లేదు. కానీ దీని ధ‌ర‌ లక్షా అరవై ఐదు వేలుగా నిర్ణయించారు. ఇక 4జీతోపాటు 5జీ వేరియెంట్‌లోనూ ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచ‌ర్లు

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచ‌ర్లు

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 7.3 ఇంచుల ఇన్పినిటీ ఫ్లెక్స్ డైన‌మిక్ అమోలెడ్ డిస్ ప్లే, 4.6 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌, 4380 ఎంఏహెచ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అయితే ఈ ఫోన్‌లో ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ లేదు. అలాగే ఇందులో వెనుక భాగంలో 16, 12, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, 10 మెగాపిక్స‌ల్ క‌వ‌ర్ కెమెరా ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ను ఎలా ప‌ట్టుకున్నా చాలా వేగంగా కెమెరాను ఓపెన్‌ చేసి ఫొటోలు తీసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు.4జీ ఎల్ టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్ బీ టైప్-సీ సపోర్ట్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. స్పీకర్లకు డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ అందించారు.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ OS

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ OS

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ లో ఆండ్రాయిడ్ పై 9.0 ఓఎస్‌ను అందిస్తున్నారు. ఒకేసారి మూడు యాప్ ల‌ను ఈ ఫోన్ డిస్‌ప్లేల‌పై ర‌న్ చేసుకోవ‌చ్చు. అలాగే వాట్సప్‌, యూట్యూబ్ తదిత‌ర సోష‌ల్ యాప్స్‌ను ఇందులో ప్ర‌త్యేకంగా అందిస్తున్నారు. ఫోన్ కోస‌మే ప్ర‌త్యేకంగా ఈ యాప్‌ల‌ను భిన్న ర‌కాల్లో డిజైన్ చేశారు. కాగా షియోమీ, లెనోవో, ఎల్‌జీ కంపెనీలు కూడా మ‌డ‌త‌బెట్టే ఫోన్ల‌ను రూపొందించే ప‌నిలో ఇప్ప‌టికే నిమ‌గ్నం కాగా, శాంసంగ్ మాత్రం ఈ ఫోన్‌ను విడుద‌ల చేసి ఆ జాబితాలో మొద‌టి స్థానంలో నిలిచింద‌నే చెప్ప‌వ‌చ్చు..!

Best Mobiles in India

English summary
Samsung Galaxy Fold user experience: Awe-inspiring but handle with care

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X