తుపాకీ కలకలం..కాలేజి మూసివేత!

Posted By:

తుపాకీ కలకలం..కాలేజి మూసివేత!

లాంగ్ బీచ్‌లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ విద్యార్థులు మంగళవారం తీవ్రమైన భయాందోళణను ఎదుర్కున్నారు. తుపాకీతో కూడిన సాయుధ అనుమానితులు కళాశాల ప్రాంగణంలోకి చొరబడ్డాడంటూ విద్యార్థుల సెల్‌ఫోన్‌లకు నోటిఫికేషన్‌లు అందటంతో ఉలిక్కిపడిన విద్యార్థి బృందం కళాశాల తరగతి గది తలుపులను మూసివేసి రక్షణ కోసం ఎదురుచూడ సాగారు. సమాచారాన్ని అందుకున్న స్థానిక కాప్స్ సంఘటన స్థలానికి చేరుకుని అసలు విషయాన్ని రాబట్టారు. నిర్మాణ కూలీ చేతిలోని సామ్‌సంగ్ గెలాక్సీ హ్యాండ్‌సెట్‌ను తుపాకీగా భ్రమపడిన పలువురు ఈ సమాచారాన్ని క్యాంపస్ మొత్తం వ్యాపింపజేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం పుకారని తేలటంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీని వీక్షించేందుకు క్లిక్ చేయండి..

ఇటీవల కాలంలో యాపిల్ ఫోన్ పేలి మహిళ మృతి చెందిన ఘటన చైనాల కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఉదంతం మొబైల్ ఫోన్ యూజర్‌లను అప్రమత్తం చేసింది. ఐఫోన్ 5 స్ర్కీన్ పేలి మహిళ కంటికి గాయమైన సంఘటన తాజాగా చైనాలో చోటుచేసుకుంది. జడ్‌డీ నెట్ ప్రచురించిన కథనం మేరకు ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. చైనా ప్రాంతానికి చెందిన లీ తన ఐఫోన్ 5 నుంచి మిత్రునితో 40 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడింది. ఆకస్మాత్తుగా ఫోన్ స్ర్కీన్ భాగం నుంచి వెచ్చటి సెగ తన ముఖాన్ని తాకినట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీ మీడియా ప్రతినిధులతో పేర్కొంది. అప్రమత్తమైన లీ ఫోన్ కాల్‌ను కట్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఫోన్ టచ్ స్ర్కీన్ ఏ మాత్రం స్పందించ లేదు. మరలా ప్రయత్నించే సరికి ఫోన్ స్ర్కీన్ నుంచి పేలుడు సంభవించి లీ కంటికి బలమైన గాయమైంది. వెంటనే స్పందించిన లీ సహచరులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting