2018లో శాంసంగ్ గెలాక్సీ జె2 రిలీజ్...స్పెక్స్, డిజైన్ లీక్!

Posted By: Madhavi Lagishetty

శాంసంగ్...స్మార్ట్ ఫోన్ల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. దక్షిణకొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ...ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తూనే ఉంది. ఈ సంస్థ నుంచి తాజాగా గెలాక్సీ సిరీస్ లో మరో రెండు స్మార్ట్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి.

2018లో శాంసంగ్ గెలాక్సీ జె2 రిలీజ్...స్పెక్స్, డిజైన్ లీక్!

జనవరి (2018)లో శాంసంగ్ గెలాక్సీ A8, గెలాక్సీ A8+ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ల గరించి ఇప్పటికే ఇంటర్నెట్లో ఎన్నో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సమయంలోనే శాంసంగ్ నుంచి లెటెస్ట్ న్యూస్ రిలీజ్ అయ్యింది. గెలాక్సీ జె2 2018లో విడుదల కానున్నట్లు ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ మోడల్ నెంబర్ SM-J250తో ప్రారంభించబడుతుందని భావిస్తున్నాయి. లెంట్రీలెవల్లో ఈ ఫోన్ పతనమవుతున్నట్లు భావిస్తున్నారు. టిప్స్టార్ రోలాండ్ రిపోర్టు ఆధారంగా జర్మన్ వెబ్ సైల్ విన్ ఫ్యూజర్ గెలాక్సీ జె2 ఫుల్ స్పెసిఫికేషన్స్ వెల్లడించింది.

శాంసంగ్ గెలాక్సీ జె2 ...5 అంగుళాల సూపర్ ఆల్మోడ్ డిస్ల్పేతో వస్తుంది. ఒక హెచ్డి (క్వాడ్ హెచ్ డి కాదు) 960.540పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుందని భావిస్తున్నారు. క్వార్ కోర్ 1.4గిగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగేన్ 425 ప్రొసెసర్ నుంచి మైక్రో ఎస్డి కార్డును మరింత విస్తరించుకునే అవకాశం ఉంటుంది. 1.5జిబి ర్యామ్ ,16జిబి డిఫాల్ట్ మెమరీ కెపాసిటి జతచేయబడి ఉంటుంది.

రూ.399తో రీఛార్జ్ చేస్తే రూ.3,300 మీ అకౌంట్లోకి, జియో మరో బంపరాఫర్

ఈస్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ తో రన్ అవుతుంది. 7.1.1నౌగట్ తో బాక్స్ నుంచి బయటకు రానుంది. ఎంట్రీ లెవన్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 8మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ముందు ఎల్ఈడి ఫ్లాష్ తో వస్తుంది. డ్యుయల్ సిమ్ , బ్లూటూత్ 4.2, క్యాట్ 4 ఎల్టీఈ, 150ఎంబిపిఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో,3.5ఎంఎం ఆడియ్ జాయ్ మరియు ఒక మైక్రో USB2.0పోర్టుతో సహా కనెక్టివిటీ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతుంది.

2600ఎంఏహెచ్ బ్యాటరీతో రన్ అవుతుంది. అంతేకాదు స్మార్ట్ ఫోన్ కు మంచి బ్యాటరీ లైఫ్ ను ఇస్తుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ జె2 ప్లాస్టిక్ బాడీతో 153గ్రాములు బరువును కలిగి ఉంటుందని రిపోర్టులో వెల్లడించింది.

శాంసంగ్ గెలాక్సీ జె2 స్పెసిఫికేషన్స్ గురించి రూమర్లు ఆగవని...ఈ స్మార్ట్ ఫోన్ రష్యాలో రిలీజ్ అవుతుందని రిపోర్టులో పేర్కొంది. కొన్ని వారాల తర్వాత ఇతర దేశాలకు చెందిన మార్కెట్లో రిలీజ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు 8,000రూబిళ్లు( 8,700రూపాయలు) ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్ కలర్స్ లో రిలీజ్ కానున్నట్లు నివేదిలో పేర్కొంది.

source

English summary
Samsung Galaxy J2 (2018) is expected to be an entry-level smartphone that will be launched sometime soon with the model number SM-J250. The fresh reports have revealed the complete specifications, pricing and the images of this smartphone. It is expected to be priced around Rs. 8,700 as it is an entry-level offering.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot