సామ్‌సంగ్ ఫోన్ ఉందా? రూ.250కే 15జీబి 4జీ డేటా మీ సొంతం

సామ్‌సంగ్ గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల కోసం ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

సామ్‌సంగ్ ఫోన్ ఉందా? రూ.250కే 15జీబి 4జీ డేటా మీ సొంతం

Read More : రెడ్మీ నోట్ 3 యూజర్లకు Airtel బంపర్ ఆఫర్

ఈ ఆఫర్‌లో భాగంగా రూ.250 పెట్టి 1జీబి 3జీ/4జీ డేటాను కొనుగోలు చేసినట్లయితే అదనంగా 14జీబి ఇంటర్నెట్ డేటా మీ సొంతమవుతుంది. ఈ డేటాను నెల రోజుల వ్యవధిలో వినియోగించుకోవల్సి ఉంటుంది. మార్చి 31, 2017 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫర్‌ను సపోర్ట్ చేసే గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఇవే

గెలాక్సీ జే2 (2015), గెలాక్సీ జే2 (2016), గెలాక్సీ జే5 (2015), గెలాక్సీ జే5 (2016), గెలాక్సీ జే7 (2015), గెలాక్సీ జే7 (2016), గెలాక్సీ జే2 ప్రో, గెలాక్సీ జే మాక్స్.

 

ఈ ఆఫర్ పొందాలంటే..?

మీ సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ నుంచి ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ ద్వారా http://www.airtellive.com/offers/ పేజీలోకి వెళ్లాల్సి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇలా చేయండి..

www.airtellive.com/offers పేజీలోకి వెళ్లినవెంటనే మీరు ఆ ఆఫర్‌కు అర్హులో కాదో తెలిసిపోతుంది. ఒకవేళ మీరు ఆ ఆఫర్‌కు అర్హత సంపాదించినట్లయితే అక్కడ కనిపించే on-screen సూచనలను అనుసరించి అంతిమంగా 'Activate Now' ఆప్సన్ పై క్లిక్ చేయండి. అదే లింక్ ద్వారా మీ నెంబర్‌కు 1జీబి 4జీ డేటా రీఛార్జ్ కాబడుతుంది. ఈ రీఛార్జ్ తాలూకా డబ్బులు మీ మెయిన్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి.

ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ ద్వారానే చేయవల్సి ఉంటుంది

వై-ఫై ఇంటర్నెట్ ద్వారా ఈ లింక్‌లోకి వెళ్లాలని ప్రయత్నించినట్లయితే ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి మీ ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ ద్వారానే ఈ యూఆర్ఎల్ లింక్‌లోకి లాగిన్ అవ్వండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్చి 31, 2017 వరకు..

ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే వర్తించే ఈ ఆఫర్ మార్చి 31, 2017 వరకు అందుబాటులో ఉంటుంది.

ఒకవేళ మీరు 3జీ సర్కిల్‌లో ఉన్నట్లయితే..

మీరు ఒకవేళ 3జీ సర్కిల్‌లో ఉన్నట్లయితే అదనంగా మీకు లభించే 14జీబి డేటాను రాత్రి వేళల్లో మాత్రమే వినియోగించుకోవల్సి ఉంటుంది. అది కూడా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటలకు వరకు మాత్రమే. మీరు 4జీ సర్కిల్‌లో ఉన్నట్లయితే అదనంగా మీకు లభించే 14జీబి డేటాను ఎప్పుడైనా వాడుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's How Samsung Galaxy J Series Users Can Get 15 GB 4G Data from Airtel at Rs.250. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot