భారీగా తగ్గిన శాంసంగ్ జె సీరిస్ ఫోన్ల ధరలు!

By Madhavi Lagishetty
|

శాంసంగ్ గెలాక్సీ J సీరిస్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గత జూన్ నెలలో ఈ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అయితే గెలాక్సీ J సీరిస్ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ను ప్రకటించింది సంస్ధ. గెలాక్సీ J7 ప్రైం 32జిబి వేరియంట్ మరియు గెలాక్సీ J7 nxt ధరలను తగ్గించింది కంపెనీ.

 
 భారీగా తగ్గిన శాంసంగ్ జె సీరిస్ ఫోన్ల ధరలు!

ముంబాయికి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం. గెలాక్సీ జె7 ప్రైం 32జీబికి రూ. 16,900రూపాయలు ఉండగా...3వేలు తగ్గించారు. ప్రస్తుతం గెలాక్సీ జె7 ప్రైం ధర 13,900రూపాయలు. అలాగే గెలాక్సీ జె7 nxt 11,490రూపాయలు ఉండగా, వెయ్యి రూపాయలు తగ్గించారు. ప్రస్తుతం 10,490రూపాయలకు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.

డివైస్ల లభ్యత మరియు ధర తగ్గింపుల గురించి గుడ్ ట్రాక్ రికార్డుతో రిటైలర్ ఈ సమాచారన్ని వెల్లడించారు. అయినప్పటికీ శాంసంగ్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.

శాంసంగ్ నుంచి ఎంట్రీ లెవల్ మరియు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఎన్నో కొత్త బ్రాండ్లు ఉన్నాయి. అయితే మార్కెట్ ఎంట్రాంట్స్ ఆధిపత్యం ఉన్నప్పుడు ఒక సమయంలో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అనేది ఒక మంచి ఫోన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

శాంసంగ్ నుంచి ఫ్లిప్ ఫోన్, హైలెట్ ఫీచర్లతో..శాంసంగ్ నుంచి ఫ్లిప్ ఫోన్, హైలెట్ ఫీచర్లతో..

స్పేసిఫికేషన్స్ రీఫ్రేష్ చేయడానికి ఈ ఏడాది మేలో ప్రారంభించిన శాంసంగ్ గెలాక్సీ జె7 ప్రైమ్ 32జీబి, మెటల్ టెక్నాలజీని మరియు 5.5అంగుళాల 2.5డి గ్లాస్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో ఉన్న ఫుట్ హెచ్డి 1080పిక్సెల్స్ రిజల్యూష్ తో వస్తుంది.

స్మార్ట్ ఫోన్ మైక్రోఎస్డి కార్డును ఉపయోగించి 256జిబి వరకు విస్తరించగల 3జి ర్యామ్ మరియు 32జిబి స్టోరేజి స్పేస్ను కలిగి ఉంటుంది. 1.6గిగా ఆక్టా కోర్ ప్రొసెసర్ జతచేయబడి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ తో రన్ అవుతుంది. ఫిజికల్ హోం బటన్ మరియు 3300ఎంఏహెచ్ బ్యాటరీలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంటుంది.

గెలాక్సీ జె7nxt 5.5అంగుళాల హెచ్ డి 720పిక్సెల్స్ సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లేతో వస్తుంది. హుడ్ కింద పనిచేసే ప్రొసెసర్ 1.6గిగా హెట్జ్ ఆక్టా కోర్ ప్రొసెసర్, ఇది 2జిబి ర్యామ్ తోపాటు మైక్రో ఎస్డి కార్డు ద్వారా 16జిబి ఇంటర్నల్ మెమరీ కెపాసిటితో 256జిబి వరకు విస్తరించుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ 7.0నూగట్ మరియు 3000ఏంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. ఇమేజింగ్ అంశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 13మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు F/1.9 ఎపర్చరు మరియు 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో F/2.2 ఎపర్చరు ఉంటాయి.

Best Mobiles in India

English summary
The Samsung Galaxy J7 Prime 32GB and Galaxy J7 Nxt have received a price cut of Rs. 3,000 and Rs. 1,000.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X