గెలాక్సీ జే7 ప్రో పై రూ.1000 తగ్గింపు
బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన గెలాక్సీ జే7 ప్రో పై సామ్‌సంగ్ రూ.1000 తగ్గింపును ప్రకటించింది. ధర తగ్గింపు అనంతరం ఈ ఫోన్ ధర రూ.19,000గా ఉంది.
బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన గెలాక్సీ జే7 ప్రో పై సామ్‌సంగ్ రూ.1000 తగ్గింపును ప్రకటించింది. ధర తగ్గింపు అనంతరం ఈ ఫోన్ ధర రూ.19,000గా ఉంది. అమెజాన్‌తో పాటు ప్లిప్‌కార్ట్‌లలో ఈ ఫోన్ సేల్ అవుతోంది.

బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌తో పాటుగా మార్కెట్లో లాంచ్ అయిన గెలాక్సీ జే7 మాక్స్ మాత్రం ఇంకా పాత ధర(రూ.17,900)తోనే ట్రేడ్ అవుతోంది.
గెలాక్సీ జే7 ప్రో స్పెసిఫికేషన్స్...
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ (1080 పిక్సల్) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ సామ్‌సంగ్ కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఎక్సినోస్ 7870 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం.
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, ఐపీ54 సర్టిఫికేషన్, 3,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్. అల్ట్రా డేటా సేవింగ్, ఎస్-బైక్ మోడ్ వంటి స్పెషల్ ఫీచర్స్‌తో పాటు సామ్‌సంగ్ మినీ పేమెంట్ సొల్యూషన్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
Galaxy J7 Max స్పెసిఫికేషన్స్...
5.7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే విత్ ఫుల్ హైడెఫినిషన్ 1080పిక్సల్ రిసల్యూషన్, మీడియాటెక్ హీలియో పీ20 ఆక్టా కోర్ సాక్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,300mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ సామ్‌సంగ్ కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, మైక్రో యూఎస్బీ పోర్ట్.
Samsung Pay Mini యాప్ గురించి...
Pay Mini యాప్‌ను Samsung Pay యాప్‌కు లైటర్ వర్షన్‌గా భావించవచ్చు. సామ్‌సంగ్ పే యాప్ కేవలం హై-ఎండ్ సామ్‌సంగ్ ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇదే సమయంలో, Pay Mini యాప్ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపై వర్షన్ పై రన్ అయ్యే అన్ని సామ్‌సంగ్ ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. MST టెక్నాలజీ పై రన్ అయ్యే స్వైపింగ్ మెచీన్‌లను Pay Mini యాప్ సపోర్ట్ చేయదు.


Click it and Unblock the Notifications








