Samsung Galaxy M01 & M11 స్మార్ట్‌ఫోన్‌ల మీద భారీ ధర తగ్గింపు
ఇండియాలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో శామ్‌సంగ్ సంస్థకు చెందిన సిరీస్ ఫోన్లు ముందు వరుసలో ఉంటాయి. ఈ సంస్థ కొత్త ఫోన్లను విడుదల చేసే ముందు తన ముందుతరం ఫోన్ల యొక్క ధరలను తగ్గిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లైన గెలాక్సీ M01 మరియు గెలాక్సీ M 11 యొక్క ధరలను తగ్గించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల యొక్క కొత్త ధరలు శామ్‌సంగ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో మరియు అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ప్రతిబింబిస్తున్నాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ M01& గెలాక్సీ M11తగ్గింపు ధరల వివరాలు
*** శామ్‌సంగ్ గెలాక్సీ M01 (3GB ర్యామ్ + 32GB స్టోరేజ్) వేరియంట్ మీద రూ.400 ధర తగ్గింపు పొందిన తర్వాత ఇప్పుడు దీనిని రూ.7,999 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు.
*** శామ్‌సంగ్ గెలాక్సీ M11 (3GB ర్యామ్ + 32GB స్టోరేజ్) వేరియంట్ మీద రూ.500 ధర తగ్గింపు పొందిన తర్వాత ఇప్పుడు దీనిని రూ.10,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
*** శామ్సంగ్ గెలాక్సీ M11 (4GB ర్యామ్ + 64GB స్టోరేజ్) వేరియంట్ మీద రూ.1,000 ధర తగ్గింపు తర్వాత ఇప్పుడు దీనిని రూ .11,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ M01 స్పెసిఫికేషన్స్
శామ్సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ 5.7-అంగుళాల HD + డిస్ప్లేను 720 x 1280 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P22 SoC ద్వారా రన్ అవుతుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ సాయంతో మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికి వస్తే దీని యొక్క వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో మెయిన్ కెమెరా f / 2.48 ఎపర్చర్‌తో 13MP లెన్స్ కెమెరా మరియు దీనితో పాటు f /1.8 ఎపర్చర్‌తో 2MP సెకండరీ లెన్స్ కెమెరాలు కలిగి ఉంటాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో f / 2.48 ఎపర్చర్‌తో 5MP సెల్ఫీ కెమెరా అమర్చబడి ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ M01 4,000mAh బ్యాటరీ, డాల్బీ అట్మోస్ టెక్నాలజీ ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మోస్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది వినియోగదారుకు సరౌండ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. దానితో పాటు ఇది మీ ఆరోగ్య స్థాయిలను పర్యవేక్షించడానికి శామ్‌సంగ్ హెల్త్ యాప్ ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంది. అదనపు భద్రత కోసం వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. అలాగే స్మార్ట్‌ఫోన్ అన్‌లాకింగ్ అనుభవాన్ని శీఘ్రంగా మరియు యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి సామ్‌సంగ్ సాఫ్ట్‌వేర్‌లో ఫేస్ రికగ్నిషన్‌ను జోడించింది. ఇది 4,000mAh బ్యాటరీని కలిగి ఉండి 168 గ్రాముల బరువుతో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ M11 స్పెసిఫికేషన్స్
శాంసంగ్ గెలాక్సీ M11 స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ AMOLED ఇన్ ఫినిటీ-యూ డిస్ ప్లే 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్ పరిమాణంలో కలిగి ఉంటుంది. అలాగే దీని డిస్ ప్లే యొక్క యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ65 ప్రాసెసర్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI2.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రన్ అవుతుంది. అలాగే ఫోన్ లో వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంది. ఇందులో గల మెయిన్ కెమెరా f / 2.0 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్, ఎఫ్ / 2.2 ఎపర్చర్ మరియు అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కెమెరాతో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాను కలిగి ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ యొక్క ముందు భాగంలో సెల్ఫీల కోసం ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ M11 సాఫ్ట్‌వేర్
శాంసంగ్ గెలాక్సీ M11 స్మార్ట్ ఫోన్ సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్10- ఆధారిత OneUI అవుట్-ఆఫ్-బాక్స్‌తో రన్ అవుతుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డు స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. ఇది డ్యూయల్ 4G Volte సిమ్ స్లాట్, వైఫై, బ్లూటూత్, GPS/A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది 15W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సామర్థ్యం గల 5000mAh బ్యాటరీ సపోర్ట్ తో ప్యాక్ చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications