Samsung Galaxy M01s లాంచ్!! బడ్జెక్ట్ ధరలో మరో ఫోన్..

|

ఇండియాలో ముందు నుంచి కూడా నోకియా ఫోన్ల తరువాత బాగా పాపులర్ అయిన బ్యాండ్ శామ్సంగ్. ఈ సంస్థ ఎప్పటికప్పుడు అన్ని రకాల ధరల వద్ద కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ మంచి ప్రజాదరణను పొందుతోంది. ఇప్పుడు శామ్సంగ్ తన Mసిరీస్‌లో మరో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెక్ట్ ధరలో గెలాక్సీ M01s పేరుతో విడుదల చేసింది.

శామ్‌సంగ్ గెలాక్సీ M01s లాంచ్

శామ్‌సంగ్ గెలాక్సీ M01s లాంచ్

గత నెల జూన్ 2, 2020 న విడుదలైన గెలాక్సీ M01 యొక్క అప్ డేట్ వెర్షన్ గా వస్తున్న గెలాక్సీ M01s బడ్జెక్ట్ ధరలో ఇప్పుడు ప్రారంభించబడింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో చూడడానికి మీకు పెద్దగా తేడాలు కనిపించవు. కొత్త గెలాక్సీ M01s మీడియాటెక్ హెలియో P22 SoC తో రన్ అవుతుంది అలాగే గెలాక్సీ M01 స్నాప్‌డ్రాగన్ 439 SoC తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో చాలా రకాల ఉత్తేజకరమైన ఫీచర్స్ ఉన్నాయి. వాటి యొక్క అన్ని రకాల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: Samsung Galaxy A21s లాంచ్!!! మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇదే!!!Also Read: Samsung Galaxy A21s లాంచ్!!! మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇదే!!!

శామ్‌సంగ్ గెలాక్సీ M01s స్మార్ట్‌ఫోన్ దరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M01s స్మార్ట్‌ఫోన్ దరల వివరాలు

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్ తన సరికొత్త గెలాక్సీ M01s ను కేవలం ఒకే ఒక వేరియంట్లలో భారత మార్కెట్లో విడుదల చేసింది. 3GB ర్యామ్ + 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభించే ఈ ఫోన్ యొక్క ధర రూ.9,999 గా కంపెనీ నిర్ణయించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌ను పొందడానికి శామ్‌సంగ్.కామ్, ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలు మరియు ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లకు వెళ్ళవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ M01s స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M01s స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M01s స్మార్ట్‌ఫోన్ 6.2-అంగుళాల HD + డిస్ప్లేను 720 x 1280 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P22 SoC ద్వారా రన్ అవుతుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్‌ సాయంతో మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ M01s కెమెరా సెటప్

శామ్సంగ్ గెలాక్సీ M01s కెమెరా సెటప్

శామ్సంగ్ గెలాక్సీ M01s స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికి వస్తే దీని యొక్క వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో మెయిన్ కెమెరా f / 2.48 ఎపర్చర్‌తో 13MP లెన్స్ కెమెరా మరియు దీనితో పాటు f /1.8 ఎపర్చర్‌తో 2MP సెకండరీ లెన్స్ కెమెరాలు కలిగి ఉంటాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో f / 2.48 ఎపర్చర్‌తో 8MP సెల్ఫీ కెమెరా అమర్చబడి ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ M01s ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M01s ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M01s స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మోస్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది వినియోగదారుకు సరౌండ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. దానితో పాటు ఇది మీ ఆరోగ్య స్థాయిలను పర్యవేక్షించడానికి ముందే ఇన్‌స్టాల్ చేసిన శామ్‌సంగ్ హెల్త్ యాప్ తో వస్తుంది. అదనపు భద్రత కోసం వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. అలాగే స్మార్ట్‌ఫోన్ అన్‌లాకింగ్ అనుభవాన్ని శీఘ్రంగా మరియు యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి సామ్‌సంగ్ సాఫ్ట్‌వేర్‌లో ఫేస్ రికగ్నిషన్‌ను జోడించింది. ఇది 4,000mAh బ్యాటరీని కలిగి ఉండి 168 గ్రాముల బరువుతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M01s Launched in India: Price, Specs, Sale date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X