Samsung Galaxy M02 బడ్జెట్ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం!! త్వరపడండి...
ఇండియాలో గత వారంలో బడ్జెట్ ధరలో లాంచ్ అయిన శామ్సంగ్ గెలాక్సీ M02 స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు భారతదేశంలో నేడు తొలిసారిగా మొదలయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ఇండియా, శామ్సంగ్ యొక్క ఆన్‌లైన్ స్టోర్ మరియు ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6739 SoC మరియు 5,000mAh బ్యాటరీ, మీడియాటెక్ SoC వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగిన శామ్సంగ్ గెలాక్సీ M02 స్మార్ట్‌ఫోన్ పోకో C3, రెడ్‌మి 9, రియల్‌మి C15, మైక్రోమాక్స్ ఇన్ 1B వంటి వాటితో పోటీ పడనుంది.

శామ్సంగ్ గెలాక్సీ M02 ధరలు & సేల్ ఆఫర్స్
భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ M02 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో విడుదల అయింది. ఇందులో 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.6,999 కాగా పరిచయ ఆఫర్ లో భాగంగా అమెజాన్.ఇన్‌లో రూ.6,799 ధర వద్ద బ్లాక్, బ్లూ, గ్రే మరియు రెడ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ధర రూ.7,499 కాగా పరిచయ ఆఫర్ లో భాగంగా రూ.7,299 ధర వద్ద పొందవచ్చు. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ను అమెజాన్, శామ్సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ మరియు ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా పొందవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ M02 మీడియాటెక్ స్పెసిఫికేషన్స్
శామ్సంగ్ గెలాక్సీ M02 ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ మెరుగైన వీక్షణ అనుభవం కోసం 6.5 అంగుళాల HD + ఇన్ఫినిటీ V డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతి ఉంది. శామ్సంగ్ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లల్లో ఒకటి బ్యాటరీ. ఇది 5000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ M02 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లో వన్ యుఐతో రన్ అవుతుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం గెలాక్సీ M02 ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








