Home
News

రూ.7వేల లోపు ధరలో Galaxy M02 కొత్త ఫోన్!! మరో నాలుగు రోజులలో లాంచ్...

ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ సంస్థ ఎప్పటికప్పుడు అన్ని రకాల ధరలలోను ఫోన్లను విడుదల చేస్తోంది. అందులో భాగంగా శామ్సంగ్ గెలాక్సీ M02 ను ఫిబ్రవరి 2 న ఇండియాలో లాంచ్ అవుతున్నట్లు ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ అమెజాన్ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. గత ఏడాది జూన్‌లో విడుదల అయిన గెలాక్సీ M01 కి అప్ గ్రేడ్ వెర్షన్ గా వస్తున్న ఈ కొత్త శామ్‌సంగ్ ఫోన్ గెలాక్సీ M సిరీస్‌లో కంపెనీ యొక్క తరువాతి తరం సరసమైన మోడల్‌గా భావిస్తున్నారు. శామ్సంగ్ గెలాక్సీ M02 ఇండియా లాంచ్ తేదీ, ధరలు మరియు స్పెసిఫికేషన్స్ వివరాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M02 ఇండియా లాంచ్ వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M02 ఇండియా లాంచ్ వివరాలు

అమెజాన్ ఈ కామెర్స్ సంస్థ శామ్సంగ్ గెలాక్సీ M02 స్మార్ట్‌ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన ల్యాండింగ్ పేజీని సృష్టించింది. ఈ పేజీ యొక్క వివరాల ప్రకారం ఈ ఫోన్ ఫిబ్రవరి 2 న మధ్యాహ్నం 1 గంటలకు ఇండియాలో ఆన్ లైన్ పద్దతిలో లాంచ్ అవుతున్నట్లు హైలైట్ చేస్తుంది. ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ ద్వారా జరుగుతుందని భావిస్తున్నారు.

శామ్‌సంగ్ గెలాక్సీ M02 ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M02 ధరల వివరాలు

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ M02 స్మార్ట్‌ఫోన్ ను రూ.7,000 ప్రారంభ ధర వద్ద విడుదల కానున్నట్లు అమెజాన్ ల్యాండింగ్ పేజీ వెల్లడించింది. ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీ M01 గతంలో 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ ను 8,999 రూపాయల ధర వద్ద లాంచ్ చేసింది. అయితే ఈ మోడల్ డిసెంబర్‌లో ధర తగ్గింపును అందుకుంది. ప్రస్తుతం ఇది రూ.7,499 ధర వద్ద లభిస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M02 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M02 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M02 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాల విషయానికి వస్తే ఇది 6.5-అంగుళాల హెచ్‌డి + ఇన్ఫినిటీ-V డిస్ప్లేతో పాటుగా 5,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు అమెజాన్ పేజీలో చూపుతున్నది. ఈ ఫోన్‌ను 3GB + 32GB మరియు 6GB + 128GB వేరియంట్‌ వద్ద నవంబర్‌లో విడుదల చేసిన గెలాక్సీ A02s రీబ్రాండెడ్ వెర్షన్ అని భావిస్తున్నారు.

శామ్‌సంగ్ గెలాక్సీ M02 స్నాప్‌డ్రాగన్ 450 SOC ఫీచర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M02 స్నాప్‌డ్రాగన్ 450 SOC ఫీచర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M02 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 SOC, 3GB ర్యామ్, 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో రిలీజ్ అవుతున్నట్లు రూమర్ సూచించింది. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరాలు మరియు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. నవంబర్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరణ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ SM-025F / DS తో మొదటిసారి శామ్సంగ్ గెలాక్సీ M02 కనిపించింది. అదే మోడల్ నంబర్ వై-ఫై అలయన్స్ వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. ఇంకా ఇటీవల శామ్సంగ్ యొక్క ప్రాంతీయ వెబ్‌సైట్‌లు కూడా శామ్‌సంగ్ గెలాక్సీ M02 యొక్క మద్దతు పేజీలను కలిగి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M02 India Launch Date and Price Revealed on Amazon Website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X