Samsung Galaxy M12 & F12 ధరలు పెరిగాయి!! కొత్త ధరలు ఇవిగో
ఇండియాలో త్వరలోనే 5G నెట్ వర్క్ అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే చాలా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీలు ఇండియాలో తమ 5G ఫోన్‌లను అధిక ధరల వద్ద విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు 5G నెట్ వర్క్ అందుబాటులో లేనందువల్ల ప్రస్తుతం బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి అధిక మంది ఇష్టపడుతున్నారు. ఇండియాలో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి గుర్తింపు ఉంది. ఈ సంస్థ ఇటీవల తమ ఫోన్‌ల యొక్క ధరలను పెంచింది. అందులో భాగంగానే ఇప్పుడు గెలాక్సీ M12 మరియు గెలాక్సీ F12 వంటి తన రెండు ప్రసిద్ధ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను కూడా పెంచింది. కొన్ని నివేదికల ప్రకారం ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల మోడళ్ల మీద రూ.500 ధర పెరిగింది. శామ్‌సంగ్ గెలాక్సీ M12 మరియు గెలాక్సీ F12 యొక్క కొత్త ధరలు ఇప్పటికే ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ స్టోర్లలో అమలులోకి వచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకొవడానికి ముందుకు చదవండి.

Samsung Galaxy M12 పెరిగిన కొత్త ధరల వివరాలు
శామ్‌సంగ్ గెలాక్సీ M12 యొక్క అన్ని వేరియంట్‌ల మీద దేశంలో ధరల పెరుగుదలను అందుకున్నాయి. గెలాక్సీ M12 యొక్క 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు రిటైల్ ధర రూ.10,999 మీద పెరుగుదలను అందుకున్న తరువాత ఇప్పుడు రూ.11,499 కొత్త ధర వద్ద అందుబాటులో ఉంది. 6.5-అంగుళాల డిస్‌ప్లే, ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, భారీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు మరిన్నింటితో సహా కొన్ని శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో ఈ ఏడాది ప్రారంభంలో శామ్‌సంగ్ గెలాక్సీ M12 విడుదలైంది.

Samsung Galaxy F12 పెరిగిన కొత్త ధరల వివరాలు
శామ్‌సంగ్ గెలాక్సీ F12 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క రిటైల్ ధర రూ.10,999 మీద పెరుగుదల అందుకున్న తరువాత ఇప్పుడు రూ.11,499 అధిక ధర వద్ద అందుబాటులో ఉంది. అలాగే 4GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ టాప్-ఎండ్ మోడల్ ధరల పెరుగుదల తరువాత ఇప్పుడు రూ.12,499 కి అందుబాటులో ఉంది. Samsung Galaxy M12 మరియు Galaxy F12 యొక్క కొత్త ధరలు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ప్రతిబింబిస్తాయి.

శామ్సంగ్ గెలాక్సీ M12 స్పెసిఫికేషన్స్
శామ్‌సంగ్ సంస్థ నుండి వచ్చినకొత్త ఫోన్ గెలాక్సీ M12 ఆండ్రాయిడ్ ఆధారిత వన్ UI కోర్ OS తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌ను కలిగి ఉండి ఎక్సినోస్ 850 SoC చేత శక్తిని పొందుతూ 6GB RAM వరకు జతచేయబడి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల HD + TFT ఇన్ఫినిటీ-V డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. అలాగే ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను జాబితా చేయబడి ఉంటుంది. అలాగే ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ సాయంతో మెమొరీని 1TB సామర్థ్యం వరకు విస్తరించవచ్చు. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో మరియు 123-డిగ్రీల వీక్షణతో 5 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2- మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్ తరహా గీత లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. గెలాక్సీ M12 ఫోన్ యొక్క ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 4G నెట్‌వర్క్‌లో 58 గంటల టాక్‌టైమ్‌ను అందించడానికి రేట్ చేయబడింది. అలాగే ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ 164.0x75.9x9.7mm కొలతలతో 221 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ F12 స్పెసిఫికేషన్స్
శామ్సంగ్ గెలాక్సీ F12 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 మరియు వన్ UI3.1 తో రన్ అవుతుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను 1080x2400 పిక్సెల్ పరిమాణంలో కలిగి ఉంది. ఇది ఎక్సినోస్ 9825 SoC తో రన్ అవుతూ 8GB RAM తో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ తో పాటు అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ 123-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ, 5 మెగాపిక్సెల్ స్థూల షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి.సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ముందు మరియు వెనుక కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్ మద్దతుతో వస్తాయి.

Realme & Redmi ఫోన్‌ల పెరిగిన కొత్త ధరలు
శామ్‌సంగ్‌తో పాటుగా రియల్‌మి, రెడ్‌మి సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచాయి. ఇటీవల చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి భారతదేశంలో రియల్‌మి 8, రియల్‌మి 8 5G, రియల్‌మి C11 (2021), రియల్‌మి C21 మరియు రియల్‌మి C25 లతో సహా ఐదు ఫోన్‌ల మీద 1500 రూపాయల ధరలను పెంచింది. అలాగే రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మి నోట్ 10, రెడ్‌మి 9, రెడ్‌మి 9i, రెడ్‌మి 9 పవర్, రెడ్‌మి నోట్ 10T మరియు రెడ్‌మి నోట్ 10s వంటి కొన్ని ప్రముఖ ఫోన్‌ల ధరలను రెడ్‌మి ఇటీవల పెంచింది.


Click it and Unblock the Notifications