Home
News

Samsung Galaxy M12 కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్!! రూ.1000 తగ్గింపుతో సేల్స్ త్వరపడండి

శామ్‌సంగ్ గెలాక్సీ M12 కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నేడు భారతదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌ 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి శామ్‌సంగ్ ఎక్సినోస్ 850 SoC చేత రన్ అవుతూ ఉంది. అలాగే 48 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ తో వెనుక ఎడమవైపు ఎగువ మూలలో చదరపు ఆకారపు మాడ్యూల్ లో క్వాడ్ కెమెరా సెటప్ మరియు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లను కలిగి ఉండి త్వరలో అమెజాన్ ద్వారా అమ్మకానికి అందుబాటులోకి వచ్చే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ గెలాక్సీ M12 ధరలు & సేల్ ఆఫర్స్ వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ M12 ధరలు & సేల్ ఆఫర్స్ వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ M12 స్మార్ట్ ఫోన్ భారతదేశంలో రెండు వేరియంట్ లలో విడుదల అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ యొక్క ధర రూ. 10,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర 13,499 రూపాయలు. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది అమెజాన్, శామ్‌సంగ్.కామ్ ద్వారా మార్చి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయించబడుతోంది. అలాగే మార్చి 18 న రిటైల్ దుకాణాల ద్వారా కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ M12 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M12 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ సంస్థ నుండి వచ్చినకొత్త ఫోన్ గెలాక్సీ M12 ఆండ్రాయిడ్ ఆధారిత వన్ UI కోర్ OS తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌ను కలిగి ఉండి ఎక్సినోస్ 850 SoC చేత శక్తిని పొందుతూ 6GB RAM వరకు జతచేయబడి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల HD + TFT ఇన్ఫినిటీ-V డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. అలాగే ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను జాబితా చేయబడి ఉంటుంది. అలాగే ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ సాయంతో మెమొరీని 1TB సామర్థ్యం వరకు విస్తరించవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ M12 48MP కెమెరా ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M12 48MP కెమెరా ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M12 యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో మరియు 123-డిగ్రీల వీక్షణతో 5 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2- మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్ తరహా గీత లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ M12 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M12 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్స్

గెలాక్సీ M12 ఫోన్ యొక్క ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 4G నెట్‌వర్క్‌లో 58 గంటల టాక్‌టైమ్‌ను అందించడానికి రేట్ చేయబడింది. అలాగే ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ 164.0x75.9x9.7mm కొలతలతో 221 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M12 New Smartphone Released in India: Price, Specs, Launch Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X