Samsung గెలాక్సీ M13 5G & M13 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి!! ధరలు, ఫీచర్స్ ఇవిగో

|

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం మరియు ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శామ్సంగ్ నేడు భారతదేశంలో గెలాక్సీ M13 5G మరియు గెలాక్సీ M13 వంటి రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు శామ్‌సంగ్ యొక్క ర్యామ్ ప్లస్ ఫీచర్‌లతో లభిస్తాయి. పొడిగించిన ర్యామ్ ఫీచర్‌లలో కొంత స్టోరేజీని మెరుగైన స్మార్ట్‌ఫోన్ పనితీరు కోసం మెమరీగా ఉపయోగిస్తుంది. ఈ గెలాక్సీ 5G వేరియంట్ 5,000mAh బ్యాటరీతో మరియు 4G మోడల్ 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ప్రైమరీ SIM నెట్‌వర్క్ లేని ప్రాంతంలో ఉన్నప్పుడు సెకండరీ SIM డేటాను ఉపయోగించి కాల్‌లు చేయడానికి లేదా స్వీకరించడానికి అనుమతించే ఆటో డేటా స్విచింగ్ టెక్నాలజీతో వస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గెలాక్సీ M13 5G & గెలాక్సీ M13 ధరలు & లాంచ్ సేల్స్ ఆఫర్స్

గెలాక్సీ M13 5G & గెలాక్సీ M13 ధరలు & లాంచ్ సేల్స్ ఆఫర్స్

భారతదేశంలో గెలాక్సీ M13 5G ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.13,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. అలాగే భారతదేశంలో గెలాక్సీ M13 మోడల్ కూడా రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.11,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.13,999 ధర వద్ద ఆక్వా గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ మరియు స్టార్‌డస్ట్ బ్రౌన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి. ఈ గెలాక్సీ రెండు మోడల్ ఫోన్లు జూలై 23 నుండి Samsung.com, Amazon మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. శామ్సంగ్ ప్రత్యేక లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే ICICI బ్యాంక్ కార్డ్లను వినియోగించి కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

ధర రూ.8999 కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్ అయింది ! సేల్ & ఆఫర్ల వివరాలుధర రూ.8999 కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్ అయింది ! సేల్ & ఆఫర్ల వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12.0-ఆధారిత One UI 4తో రన్ అవుతుంది. అలాగే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో లభిస్తుంది. ఇది హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoCతో రన్ అవుతూ 6GB వరకు RAMతో జత చేయబడి వస్తుంది. శామ్సంగ్ RAM ప్లస్ ఫీచర్‌తో RAMని 12GB వరకు పొడిగించుకోవచ్చు.

రియల్‌మి 9 రివ్యూ: కేవలం 4Gతో లభించే ఫోన్‌ను ఎంచుకోవడం ఎంతవరకు ఉత్తమం?రియల్‌మి 9 రివ్యూ: కేవలం 4Gతో లభించే ఫోన్‌ను ఎంచుకోవడం ఎంతవరకు ఉత్తమం?

కెమెరా సెటప్‌

ఫోటోలు మరియు వీడియోల కోసం గెలాక్సీ M13 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులోని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, 5G (11 5G బ్యాండ్‌లు) మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది Samsung నాక్స్ సెక్యూరిటీ సూట్‌తో వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ M13 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12.0-ఆధారిత One UI 4 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-HD+ LCD డిస్‌ప్లేను 480 నిట్స్ బ్రైట్‌నెస్‌తో మరియు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో అందిస్తుంది. ఇది హుడ్ కింద Exynos 850 SoC ద్వారా శక్తిని పొందుతూ 6GB వరకు RAMతో జత చేయబడి వస్తుంది. Samsung RAM ప్లస్ ఫీచర్‌తో RAMని 12GB వరకు పొడిగించుకోవచ్చు.

కెమెరా సెటప్‌

ఫోటోలు మరియు వీడియోల కోసం గెలాక్సీ M13 ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, 4G LTE మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది మరియు Samsung నాక్స్ సెక్యూరిటీ సూట్‌తో వస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M13, Galaxy M13 5G Smartphones Launched in India: Price, Specs, Sale Date, Launch Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X