శాంసంగ్ కొత్త 5G ఫోన్ సేల్ ఈ రోజు మొదలైంది! ధరలు, ఆఫర్లు& స్పెసిఫికేషన్లు
ఈ వారం ప్రారంభంలో లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ M14 ఇప్పుడు భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటు ధరతో మార్కెట్లో ఉంది. అయినప్పటికీ ధరకు తగినట్లుగానే పెద్ద బ్యాటరీ, తాజా ఆపరేటింగ్ సిస్టమ్ మరియు మంచి కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
గెలాక్సీ M14 ఎక్సీనోస్ 1330 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. ఈ ఫోన్ 5nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికొస్తే, ఈ హ్యాండ్‌సెట్ పూర్తి HD+ రిజల్యూషన్‌తో LCD డిస్ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ M14 5G స్మార్ట్ ఫోన్ భారతదేశంలో ధర, లభ్యత వివరాలు,
శాంసంగ్ గెలాక్సీ M14 5G స్మార్ట్ ఫోన్ యొక్క బేస్ మోడల్, ధర ₹13,490 వద్ద అందుబాటులో ఉంది, ఇది 4GB RAM మరియు 128GB నిల్వతో కాన్ఫిగర్ చేయబడి వస్తుంది. అదే సమయంలో, 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో ఉన్న వేరియంట్ ఫోన్ ధర ₹14,990 గా ఉంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ M14 స్మార్ట్ ఫోన్ ని మీరు అమెజాన్, శాంసంగ్ ఇండియా స్టోర్ మరియు ప్రముఖ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బెర్రీ బ్లూ, స్మోకీ టీల్ మరియు ఐసీ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ M14 5G స్పెసిఫికేషన్‌ల వివరాలు,
గెలాక్సీ M14 స్మార్ట్ ఫోన్ 1080 × 2408 పిక్సెల్‌ల పూర్తి HD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎగువన ఇన్ఫినిటీ-V నాచ్ ఉంది, దీనిలో సెల్ఫీ కెమెరా ఉంటుంది.
కెమెరాల గురించి తెలుసుకుంటే, గెలాక్సీ M14 వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది, ఇది LED ఫ్లాష్ తో వస్తుంది, 2MP మాక్రో లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో ఉంటుంది. ముందు భాగంలో, సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M14 ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 1330 చిప్‌సెట్‌తో అమర్చబడింది, దానితో పాటు Mali G68 GPU కూడా ఉంది. ఈ పరికరం USB టైప్-C పోర్ట్ ద్వారా 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో భారీ 6,000mAh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంటుంది.
అవును, ఇది ఆండ్రాయిడ్ 13తో విడుదలైంది, ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే, హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత OneUI కోర్ 5.1ని ఆపరేట్ చేస్తుంది. ఇంకా బ్రాండ్ రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు మరియు నాలుగు సంవత్సరాల భద్రతా అప్డేట్ లను అందించనున్నట్లు కూడా వాగ్దానం చేస్తుంది.
ఇక భద్రత కోసం,ఈ ఫోన్లో M14 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.2, వైఫై 802.11 ఎసి మరియు జిపిఎస్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ విస్తరణ కోసం మైక్రో-SD కార్డ్ స్లాట్ మరియు 3.5mm ఆడియో పోర్ట్ కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








