5000mAh బ్యాటరీ, 128GB స్టోరేజీ Samsung స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. ధర, సేల్ వివరాలు
శాంసంగ్ సంస్థ ఇటీవల తన అనేక మోడళ్ల స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గిస్తోంది. తాజాగా శాంసంగ్ గెలాక్సీ M14 5G ( Samsung Galaxy M14 5G ) హ్యాండ్‌సెట్ ధరను తగ్గించింది. ఈ స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం భారత్‌లో విడుదల అయింది. ఈ శాంసంగ్ గెలాక్సీ M14 5G స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్, స్టోరేజీ వేరియంట్లలో అందుబాటలు ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M14 5G ధర :
గత సంవత్సరం ఏప్రిల్‌లో శాంసంగ్ గెలాక్సీ M14 5G హ్యాండ్‌సెట్ భారత్‌లో లాంచ్ అయింది. విడుదల సమయంలో స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ + 64GB వేరియంట్ ధర రూ.13,490గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,990గా ఉంది. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.1000 తగ్గిస్తూ శాంసంగ్ నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.12490 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,990 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఐసీ సిల్వర్, బెర్రీ బ్లూ, స్మోకీ టీల్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ M14 5G స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల పుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ముందువైపు వాటార్ డ్రాప్ నాచ్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ Exynos 1330 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు Mail-G68 MP2 GPUతో జతచేయబడుతుంది.

శాంసంగ్ గెలాక్సీ M14 5G బ్యాటరీ :
ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 64GB, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉండగా... మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5.1 OS ను కలిగి ఉంటుంది. మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M14 5G కెమెరా వివరాలు:
కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అందులో 50MP ప్రధాన కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటి పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టుతో రానుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications